ఆనంద్ దేవరకొండ మూవీ ‘దొరసాని’ కథ రాయడానికి ఐదేళ్లు పట్టిందట!
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ 'దొరసాని' అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అతడు రాజు అనే పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 1980 నాటి బ్యాక్ డ్రాప్‌లో నడిచే ఈ మూవీలో ఆనంద్ దేవరకొండకు జంటగా రాజశేఖర్, జీవితల రెండో కుమార్తె శివాత్మిక నటిస్తుంది. '
షార్ట్ ఫిల్మ్ మేకర్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ద్వారా ఆయన మెయిన్ స్ట్రీమ్ మూవీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక ఇద్దరూ నటనకు కొత్త కావడంతో సినిమా మొదలవ్వడానికి ముందే ఇద్దరికీ యాక్టింగులో శిక్షణ ఇప్పించారట.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహేంద్ర మాట్లాడుతూ...తాను గత 17 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నట్లు తెలిపారు. 1980 కాలం నాటి పరిస్థితులకు అద్దం పడుతూ రియల్ లైఫ్ సంఘటనలను స్పూర్తిగా తీసుకుని కథను తయారు చేసినట్లు, దీన్ని పూర్తి చేయడానికి తనకు 5 సంవత్సరాల సమయం పట్టినట్లు తెలిపారు. అప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో ఒక టీనేజీ జంట మధ్య ప్రేమ వ్యవహారం ఎలాంటి పరిస్థితులకు దారి తీసిందనేది ఇందులో చూపించబోతున్నట్లు తెలిపారు.
'పెళ్లి చూపులు' నిర్మాత యష్ రంగినేని, మధుర శ్రీధర్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జులై 5వ తేదీన 'దొరసాని' రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తెలంగాణ విలేజ్ ప్రాంతానికి సంబంధించిన కథతో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











