ప్రభాస్ తోనే కాదు.. ఆ పాన్ ఇండియా స్టార్ తో కూడా మారుతి సినిమా.. పక్కా అంటూ..
కమర్షియల్ కామెడీ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న మారుతి ఈసారి గోపీచంద్ తో పక్కా కమర్షియల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాజిటివ్ వైబ్రేషన్స్ తో విడుదలైన ఈ సినిమా మొదటిరోజు కాస్త భిన్నమైన టాక్ అందుకోవడంతో కలెక్షన్స్ ఊహించనంత గా ఏమీ రాలేదు. ఇక మారుతి ప్రభాస్ కు సంబంధించిన ప్రాజెక్టు పై గత కొంతకాలంగా అనేక రకాల కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ డైరెక్టర్ లిస్టు లో మరొక పాన్ ఇండియా హీరో కూడా ఉన్నట్లుగా ఇటీవల క్లారిటీ ఇచ్చేశాడు. వివరాల్లోకి వెళితే..

ఆ హీరోలకు హిట్స్
మారుతి ఎలాంటి సినిమా చూసిన కూడా అందులో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కమర్షియల్ ఎలిమెంట్స్ ను హైలెట్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా కామెడీతోనే అతను బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు. ఒక విధంగా వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్నా హీరోలకు కూడా బూస్ట్ ఇచ్చాడు అని చెప్పాలి. మారుతి దర్శకత్వంలో నాని బలే బలే మగాడివోయ్ సినిమా చేసి మళ్లీ సక్సెస్ ట్రాక్లోకి రాగా అదే తరహాలో శర్వానంద్ కూడా మహానుభావుడు అనే సినిమాతో ఫామ్ లోకి వచ్చేసాడు.

పక్కా కమర్షియల్
ఇక ఇప్పుడు అదే తరహాలో వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్న గోపీచంద్ కూడా సక్సెస్ ట్రాక్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కోర్ట్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుంది అనేది వీకెండ్ ముగిస్తే గాని క్లారిటీ రాదు. కానీ చిత్ర యూనిట్ మాత్రం సినిమాకు ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చినట్లు తెలియజేసింది. మొదటి రోజే ఆ సినిమా 6 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్నట్లు పోస్టర్ కూడా విడుదల చేశారు.

అభిమానులకు నచ్చేలా..
ఇక మారుతి తన తదుపరి ప్రాజెక్టును ఎవరితో చేస్తారు అనే విషయం కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే గత కొంత కాలంగా ప్రభాస్ తో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఆ విషయంలో దర్శకుడు మారుతి కొంత క్లారిటీ ఇచ్చాడు. తప్పకుండా ప్రభాస్ అభిమానులకు నచ్చే విధంగా తగ్గట్టుగా సినిమా ఉంటుంది అని తెలియజేశారు.

మరో పాన్ ఇండియా హీరోతో
ఇక మరొక పాన్ ఇండియా స్టార్ హీరోతో మారుతి సినిమా చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. అతను మరెవరో కాదు అల్లు అర్జున్ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మారుతి తెలియజేశాడు. అల్లు అర్జున్ తో ఎప్పటి నుంచో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాను అని అయితే ఇతర కమిట్మెంట్స్ కారణంగా మా ఇద్దరి కాంబినేషన్ కుదరడంలేదు అని అన్నారు.

కథ కూడా ఫిక్స్?
ఎలాగైనా సరే భవిష్యత్తులో మాత్రం తప్పకుండా అల్లు అర్జున్ తో మాత్రం ఒక సినిమా చేస్తానని ఇదివరకే కొన్ని కథలు కూడా అనుకున్నట్లు మారుతి తెలియజేశాడు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సెకండ్ పార్ట్ పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నాడు ఆ తర్వాత మరో అగ్ర దర్శకుడి తో కూడా ఓ సినిమా చేసే అవకాశం ఉంది. ఇక మారుతి సినిమాని ఎప్పుడు ట్రాక్ లోకి తీసుకు వస్తాడో చూడాలి


Click it and Unblock the Notifications











