అయ్యో సర్.. నేను ఫిలిం డైరెక్టర్ మారుతిని!
సినీ దర్శకుడు మారుతికి కొత్త సంవత్సరంలో సరదాగా సంఘటన ఎదురైంది. సోషల్ మీడియా వేదికగా ఓ పొరపాటు జరిగింది. ఓ నెటిజన్ పొరపాటు పట్ల దర్శకుడు మారుతి కూల్ గా సమాధానం ఇచ్చాడు. తన పొరపాటు గ్రహించిన సదరు నెటిజన్ ట్వీట్ ని డిలీట్ చేశాడు. ఇంతకీ ఎం జరిగిందంటే.. సదరు వ్యక్తి సోషల్ మీడియా వేదికగా ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకికి ఫిర్యాదు చేయాలని భావించాడు.
బహుశా సదరు నెటిజన్ మారుతి సుజికి కస్టమర్ ఏమో. తనకు వచ్చిన సమస్యని వివరిస్తూ ట్విట్టర్ వేదికగా మారుతి సుజుకి సంస్థకు ఫిర్యాదు చేశాడు. కానీ పొరపాటున సినీ దర్శకుడు మారుతికి ట్యాగ్ చేయడంతో ఆ ఫిర్యాదు అతడికి వెళ్ళింది. దీనితో సదరు నెటిజన్ చేసిన పొరపాటుని గుర్తు చేస్తూ.. సర్ నేను సినీ దర్శకుడు మారుతిని. మారుతి సుజుకి సంస్థతో నాకు ఎలాంటి సంబంధం లేదు. మీ పొరపాటుని సరి చేసుకుని సరైన వ్యక్తులకు ఫిర్యాదు పంపండి. థాంక్యూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు అని కూల్ గా రిప్లై ఇచ్చాడు.

సినిమాల విషయానికి వస్తే మారుతి చివరగా తెరకెక్కించిన చిత్రం శైలజా రెడ్డి అల్లుడు. నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఈ చిత్రం పరవాలేదనిపించింది. కానీ ఆశించిన విజయాన్ని అందించలేదు. మారుతి తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు.


Click it and Unblock the Notifications











