ప్రభాస్ సినిమాపై మొదటిసారి స్పందించిన మారుతి.. ఫ్యాన్స్ కు నచ్చే విధంగా అంటూ..
కామెడీ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న దర్శకుడు మారుతి త్వరలోనే ప్రభాస్ తో కూడా ఓ సినిమా స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు గతంలో అనేక రకాల కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్ట్ పై ఎప్పుడూ కూడా మారుతి గాని యు.వి.క్రియేషన్స్ గాని స్పందించింది లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆ ప్రాజెక్టు పై అనేక రకాల గాసిప్స్ పుట్టుకొచ్చాయి. ఇక మొదటిసారి దర్శకుడు మారుతి ప్రభాస్ తో చేయబోయే ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు అతను ఏమన్నాడు అనే వివరాల్లోకి వెళితే..

వరుసగా రెండు సినిమాలు
బాహుబలి సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సాహో తర్వాత వచ్చిన రాధే శ్యామ్ రెండు సినిమాలు కూడా అన్ని భాషల్లో కూడా మంచి హైప్ ఐతే క్రియేట్ చేసాయి కానీ బాక్సాఫీసు వద్ద మాత్రం ఆ రెండు సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచాయి. దీంతో ఆడియన్స్ కు నచ్చే విధంగా ఒక మంచి సినిమా చేయాలని ప్రభాస్ ఆలోచిస్తున్నాడు.

లైనప్ లో 4 సినిమాలు
ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో 4 సినిమాలు ఉన్నాయి. ఆదిపురుష్ సినిమా రామాయణ కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఆ తర్వాత రాబోయే సలార్ సినిమా అయితే ఐ వోల్టేజ్ యాక్షన్ సినిమాగా రానుంది. KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆ సినిమాను డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక లైన్ లో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ K, సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్ అనే సినిమా చేయాల్సి ఉంది.

ఎన్నో రూమర్స్
అయితే రాబోయే సినిమాలన్నటిపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ ఒక మారుతి సినిమాపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఆ సినిమా కామెడీ బ్యాక్ డ్రాప్ లో రానుందని ఇప్పటికే హైదరాబాద్ లో ఒక ప్రత్యేకమైన సెట్ కూడా నిర్మించారని దాదాపు షూటింగ్ మొత్తం అక్కడే జరగనుందని కూడా అనేక కల వార్తలు వచ్చాయి. అంతేకాకుండా రాజా డీలక్స్ అనే టైటిల్ కూడా అనుకుంటున్నట్లు కథనాలు వెలువడ్డాయి.

స్పంధించిన మారుతి
అయితే ఆ వార్తలపై కూడా మారుతి ఎప్పుడు అఫీషియల్ గా స్పందించలేదు. కానీ పక్కా కమర్షియల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ సినిమాపై మొదటిసారి స్పందించక తప్పలేదు. ఎక్కువ విషయాలను చెప్పలేదు గాని ప్రభాస్ ను మాత్రం ఒక బుజ్జిగాడు డార్లింగ్ తరహాలో చూపించాలని అనుకుంటున్నట్లు మారుతి తెలియజేశాడు.

ఫ్యాన్స్ కు నచ్చే విధంగా..
నేను ఏ సినిమా చేసినా కూడా హీరో బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు పర్ఫెక్ట్ కథను సిద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఇక ప్రభాస్ ని దృష్టిలో పెట్టుకుని ఆయన కోసం ప్రత్యేకంగా కదా రెడీ చేయాలి అంటే కాస్త ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడే మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. కానీ తప్పకుండా ఫ్యాన్స్ కు నచ్చే విధంగా ప్రభాస్ ను చూపించడానికి ప్రయత్నం చేస్తానని మారుతి తెలియజేశాడు.


Click it and Unblock the Notifications











