Don't Miss!
- News షర్మిలపై జగన్ కామెంట్స్ ! చంద్రబాబు కౌంటర్-సజ్జల ఎన్ కౌంటర్..!
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విజయనిర్మల చరిత్రలో నిలిచిపోతారు.. దర్శకుడు మారుతి
ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల ఇకలేరు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడతున్న ఆమె బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ విజయ నిర్మల మరణించారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. విజయ నిర్మల మృతి వార్త సినీ వర్గాలు, అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. విజయ నిర్మల కుటుంబానికి పలువురు సినీ, వ్యాపార, ఇతర పరిశ్రమల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా దర్శకుడు మారుతి తన సంతాప ప్రకటనలో ఏమన్నారంటే..
11 సంవత్సరాలకే నటిగా తెలుగు సినిమా ఇండస్ట్రిని తన కుటుంబంగా చేసుకున్న మహనటి, గొప్ప దర్శకురాలు శ్రీమతి విజయనిర్మల గారి హఠాన్మరణం విని షాక్ కి గురయ్యాను..తెలుగు సినిమా అంటే మగవారి ఆధిక్యత వుంటుంది అని చెప్పుకునే ఆ రోజుల్లోనే మహిళా దర్శకురాలుగా తన సత్తాచాటిన విజయనిర్మల గారు చరిత్ర లో ఎప్పటికి నిలిచిపోతారు అని దర్శకుడు మారుతి పేర్కొన్నారు.
అంతటి టాలెంటెడ్ లేడి డైరెక్టర్‌ను మనం ఇప్పట్లో ఇంకెవరినీ చూడలేం. సూపర్‌స్టార్ కృష్ణగారికి జీవిత భాగస్వామిగా ఎప్పుడూ ఆయన పక్కన ఉండేవారు.. ఇప్పడు విజయనిర్మల గారు లేని లోటు కృష్ణ గారికి ఆ కుటుంబానికే కాదు యావత్ తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కృష్ణగారికి, నరేష్ గారికి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అని దర్శకుడు మారుతి అన్నారు.
కాగా, విజయ నిర్మల భౌతికకాయాన్ని గురువారం (జూన్ 27న) ఉదయం 11 గంటలకు నానక్‌రామ్‌గూడాలోని ఆమె స్వగృహానికి తీసుకు వస్తారు. అభిమానులు, సినీ ప్రముఖులు సందర్శనార్థం అక్కడే ఉంచి శుక్రవారం ఉదయం ఫిలిం ఛాంబర్‌కు తీసుకువచ్చి ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తారు. శుక్రవారం మధ్యాహ్నం గానీ, సాయంత్రంగానీ ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారు అని సినీ వర్గాలు పేర్కొన్నాయి.