ఆ స్టార్ హీరో క్లోజ్ ఫ్రెండ్.. అందుకే అతనితో సినిమా చేయడం లేదు: డైరెక్టర్ మారుతి!
సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న దర్శకుడు మారుతి. సింపుల్ లైన్ ని రెండు గంటల పాటు మంచి కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందించగల ఈ దర్శకుడు మెల్లమెల్లగా తన మార్కెట్ ని పెంచుకుంటూ వెళుతున్నాడు. దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మారుతి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

కథ సెట్టయిన తరువాతే..
బాక్సాఫీస్ వద్ద మారుతి సినిమాలు మినిమమ్ వసూళ్లను అందుకుంటాయి. అందుకే నిర్మాతలు ఈ దర్శకుడిని ఎక్కువగా ఫాలో అవుతుంటారు. అయితే మారుతి మాత్రం కథ సెట్టయిన తరువాతే డీల్ సెట్ చేసుకుంటాడట. సినిమా బడ్జెట్ కి త్రిబుల్ ప్రాఫిట్స్ ని అందించగల సత్తా ఉన్న మారుతి ఎలాంటి హీరోలతో అయినా హిట్టు కొట్టగలడు.

బిగ్గెస్ట్ హిట్స్..
నాని కెరీర్ లో భలే భలే మగాడివోయ్ సినిమా బిగ్గెస్ట్ హిట్ అని చెప్పవచ్చు. కెరీర్ క్రిటికల్ గా ఉన్న సమయంలో ఆ సినిమా మంచి విజయాన్ని అందించింది. ఇక మొన్న సాయి ధరమ్ తేజ్ తో ప్రతి రోజు పండగే అనే సినిమాను చేసి అతని కెరీర్ కి కూడా మంచి బూస్ట్ ఇచ్చాడు. ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలకు మారుతి అంటే చాలా ఇష్టం. అందులో అల్లు అర్జున్ కూడా ఉన్నాడు.

అల్లు అర్జున్ బెస్ట్ ఫ్రెండ్..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ మారుతి క్లోజ్ ఫ్రెండ్స్ అని చాలా తక్కువ మందికి తెలుసు. ఎప్పటినుంచో వారిద్దరికి మంచి పరిచయం ఉంది. అయితే ఇటీవల అల్లు అర్జున్ తో మారుతి సినిమా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు కథనాలు వెలువడ్డాయి. దాదాపు దర్శకుడు చెప్పిన కథకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వచ్చింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదు.
Recommended Video

క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..
అల్లు అర్జున్ తో ప్రస్తుతానికి ఎలాంటి సినిమాకు కమిట్ అవ్వలేదని చెప్పిన మారుతి ఆయన క్లోజ్ ఫ్రెండ్ అయినప్పటికీ ఫ్రెండ్షిప్ వేరు.. ప్రొఫెషన్ వేరు అని వివరణ ఇచ్చాడు. ప్రతి రోజు వాట్సాప్ ద్వారా తాము టచ్ లో ఉంటామని చెబుతూ.. ఎదో ఒకరోజు మాత్రం మంచి కథ సెట్టయితే తప్పకుండా అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తానని అన్నారు. ఇక కథ సెట్టయితే ఆలస్యం చేయకుండా వెంటనే ఆ సినిమాకు సంబంధించిన విషయాల గురించి కూడా చెబుతానని.. కథ సెట్టవ్వకనే అతనితో సినిమా చేయడం లేదని మారుతి వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











