twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    3D టెక్నాలజీలో పరమానందయ్య శిష్యుల కథ.. డైరెక్టర్ మారుతితో

    |

    తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సరిగా చిన్నారుల కోసం 3డి ఫార్మాట్ లో తెరకెక్కిన సినిమాగా శ్రీ పరమానందయ్య శిష్యుల కథ 3డి విడుదల సిద్ధం అవుతుంది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ని డైనమిక్ డైరెక్టర్ మారుతీ విడుదల చేశారు. అలనాటి పరమానందయ్య శిష్యుల కథ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే, ఈ నేపథ్యంలో పింక్ రోజ్ సినిమాస్ పతాకం పై కాటంరెడ్డి సంతన్ రెడ్డి, సి హెచ్ కిరణ్ శర్మ నిర్మాతలుగా, వెంకట రాజేష్ పులి దర్శకత్వంలో తెరకెక్కింది.

    ఈ సందర్బంగా మారుతూ మాట్లాడుతూ చిన్నారుల కోసం, పిల్లలకు నచ్చేలా ఇప్పుడున్న టెక్నాలజీ వాడుకొని మనందరికీ తెలిసిన పరమానందయ్య శిష్యుల కథను కొత్తగా చూపించే ప్రయత్నం చేసినందుకు ఈ చిత్ర బృందానికి నా అభినందనలు తెలుపుతున్నాను. పిల్లతోపాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని తెలిపారు. త్వరలోనే ఈ సినిమా కి సంబందించిన మరిన్ని విషయాలు తెలుపుతామని నిర్మాతలు చెప్పారు.

    Director Maruthi released Paramanandayya Shishyula Katha 3d teaser

    చిన్నారుల కోసం తీసిన తొలి తెలుగు 3డి చిత్రం పరమానందయ్య శిష్యుల కథలో ఉన్న నీతిని చిన్నారులకు మరింతగా చేరవేయడం కోసం ఈ చిత్రాన్ని 3డిలో రెడీ చేశారు. ఇక అలానే ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే రీతిన కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు.

    బ్యానర్ : పింక్ రోజ్ సినిమాస్
    నిర్మాతలు : కాటంరెడ్డి సంతన్ రెడ్డి, సి హెచ్ కిరణ్ శర్మ
    దర్సకత్వం : వెంకట రాజేష్ పులి
    ఛాయాగ్రహణం : జి. ప్రభాకర్ రెడ్డి
    కూర్పు : కార్తీక్ శ్రీనివాస్
    సంగీతం : యాజమాన్య

    English summary
    Director Maruthi released Paramanandayya Shishyula Katha 3d teaser. This movie made with high end technology of 3D. Directedby Venkata Rajesh Puli, Produced by Santan Reddy, CH Kiran Sharma.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X