మొత్తానికి సినీ‘మా’వద్దకి వచ్చాం.. డైరెక్టర్ మారుతీ ట్వీట్ వైరల్
కరోనా వైరస్ ఉధృతి తగ్గకపోయినా సరే మళ్లీ అందరూ మామూలూ స్థితికి వస్తున్నారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఎవరి పని వారు చేసుకుంటూ లైఫ్‌లో బిజీ అవుతున్నారు. అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక అన్నింటికి అనుమతులు లభించాయి. విద్యా సంస్థలు, థియేటర్లు తప్పా అన్ని ప్రారంభమయ్యాయి. ఇక నేడు థియేటర్లు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ మల్టీప్లెక్స్‌లు ప్రారంభమయ్యాయి. హాలీవుడ్ మూవీ టెనెట్ నేడు విడుదల కానుంది.
టెనెట్ చిత్రాన్నీ వీక్షించేందుకు టాలీవుడ్ సెలెబ్రిటీలు కదిలారు. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ అందరికీ అవగాహన కలిగించే వీడియోను కూడా వదిలాడు. హైద్రాబాద్‌లో మల్టీ ప్లెక్స్‌ల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని, సినిమా ప్రేమికులకు మళ్లీ సమయం వచ్చిందని, థియేటర్లో సినిమా చూస్తేనే ఆ కిక్కు వస్తుందని సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు. దర్శకుడు మారుతి తన స్నేహితులతో పాటు సినిమాను వీక్షించేందుకు వెళ్లాడు.


ఈ మేరకు థియేటర్ వద్ద సెల్ఫీలతో సందడి చేశాడు. చాలా రోజులు తరువాత థియేటర్లో సినిమా వీక్షించబోతోన్నామని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈ మేరకు మారుతి ట్వీట్ చేస్తూ.. మొత్తానికి మేము సినీ మా దగ్గరికి వచ్చాం.. ఇక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ఇది ఎంతో సురక్షితం.. థియేటర్లో సినిమాను చూసి ఎంజాయ్ చేయడం ఎంతో సరదాగా ఉంటుంది.. మొత్తానికి మళ్లీ మునుపటి రోజులు వచ్చాయని చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











