ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ప్రభాస్ డైరెక్టర్ క్షమాపణ.. ఇంతకీ వివాదం ఏంటీ?

Director Maruthi: టాలీవుడ్ దర్శకుడు మారుతి - రెబల్ స్టార్ ప్రభాస్ కాంబో తెరకెక్కిన మూవీ 'ది రాజాసాబ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ గా సంక్రాంతి 2026కి ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు, ప్రీ లుక్ కు ఎనలేని హైప్ క్రియేట్ అయింది. తాజాగా ది రాజాసాబ్ 'ఫస్ట్ సింగిల్'‌ను విడుదల చేశారు. ఈ ఈవెంట్ లో డైరెక్టర్ మారుతి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు డైరెక్టర్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో డైరెక్టర్ మారుతి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు . ఇంతకీ ఏం జరిగిందంటే? ఇంతకీ ప్రభాస్ వర్సెస్ జూ. ఎన్టీఆర్ మధ్య ఫ్యాన్ వార్ కు కారణమేంటీ?

'ది రాజాసాబ్' నుంచి విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ 'రెబల్ సాబ్' పాట లాంచ్‌కు బాలానగర్‌లోని విమల్ థియేటర్స్‌లో భారీ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు మారుతి, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, ఎస్కేఎన్ హాజరయ్యారు.ఈ ఈవెంట్ లో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. ప్రభాస్‌పై తన అభిమానాన్ని స్పష్టం చేస్తూ అనేక వ్యాఖ్యలు చేశాడు. "నేను రెబల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాను. ప్రభాస్ నా టాలెంట్‌ను గుర్తించి యూనివర్సిటీలోకి జాయిన్ చేసుకున్నాడు. ప్రభాస్ ఫోటో జేబులో పెట్టుకునే ఎవరైనా టాప్ డైరెక్టర్ అవుతాడు" అని మారుతి చెప్పాడు.

Director Maruthi s Collar Comment Sparks Fan War Prabhas Event Remarks Trigger NTR Fans

ఇంకా సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి "రేపు పండక్కి ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తారు అని నేను చెప్పను... ఎందుకంటే ప్రభాస్ కటౌట్‌కి అవి చాలా చిన్న మాటలు" అని చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్రబిందువు అయ్యాయి. ఈ కామెంట్స్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా వ్యతిరేఖించారు. టాలీవుడ్‌లో 'కాలర్ ఎగరేయడం' అనే యాక్షన్ మొదట గుర్తుకు వచ్చే హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. తారక్ ఫ్యాన్స్ ఎప్పుడూ ఆయన ఈ జెస్టర్‌ను గర్వంగా మెయింటైన్ చేస్తుంటారు. ఎన్నో ఈవెంట్లలో ఎన్టీఆర్ స్వయంగా కాలర్ ఎత్తి అభిమానులలో ఉత్సాహం నింపాడు.

'దేవర' ఈవెంట్‌లో కూడా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా సినిమా ఉంటుందన్న సంకేతం ఇచ్చాడు. ఇక 'వార్ 2' సినిమా ప్రమోషన్స్ లో కూడా పలుమార్లు కాలర్ ఎత్తి చూపించడం అభిమానుల్లో ఫెవరేట్ మోమెంట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో మారుతి కాలర్ వ్యాఖ్యలను ఎన్టీఆర్ స్టైల్‌పై తక్కువ చేసి మాట్లాడినట్లుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావించారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు.

"ఒక హీరోని ఎత్తిచూపడానికి ఇంకొక హీరోను తగ్గించే హక్కు ఎవరికీ లేదు", "పెద్ద హీరోతో సినిమా కుదిరింది కాబట్టి ఇంత అహంకారం వచ్చిందా?" అంటూ ఇష్టానుసారంగా కామెంట్లు చేశారు. కొంతమంది అయితే.. వ్యక్తిగత దూషణ కూడా చేశారు. మరోవైపు ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ విషయం‌ను పాజిటివ్‌గా తీసుకుంటూ ఆ కామెంట్స్ ను వైరల్ చేయడం ప్రారంభించారు. ఫలితంగా సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ ప్రభాస్ ఫ్యాన్ వార్ గా మారింది. ఇరు ఫ్యాన్స్ మధ్య కాసేపు వివాదం కొనసాగింది.

ఇక ఈ వివాదం క్రమక్రమంగా తీవ్ర రూపం దాల్చుతుండటంతో డైరెక్టర్ మారుతి స్పందించారు. వెంటనే ఎక్స్ (X) వేదికగా స్పష్టత ఇచ్చాడు. "నేను నా వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. ముందుగా ప్రతి అభిమానికీ హృదయపూర్వక క్షమాపణలు. ఎవరినీ బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. స్టేజ్‌పై మాట్లాడినప్పుడు కొన్నిసార్లు మనం అనుకున్న విధంగా మాటలు బయటకు రావు. నేను మాట్లాడినది తప్పుగా అర్థం చేసుకున్నందుకు చింతిస్తున్నాను. నాకు ఎన్టీఆర్ గారి పట్ల, ఆయన అభిమానుల పట్ల అపారమైన గౌరవం ఉంది. నేను ఆయనను ఉద్దేశించి ఈ మాటలు చెప్పలేదు" అని మారుతి వివరించాడు. తన ఉద్దేశం ప్రభాస్ కటౌట్ మహిమను చెప్పడమే తప్ప ఏ హీరోతో పోల్చడం కాదని ఆయన చెప్పాడు.

ఇలా ఈ రోజుల్లో ఎవరు? ఏం మాట్లాడిన ఇట్టే వైరలవుతోంది. అలా కలర్ అనే పదం కూడా అభిమాన వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పుడు మారుతి బహిరంగ క్షమాపణల తర్వాత ఈ వివాదం శాంతిస్తుందా? లేక మరోసారి సోషల్ మీడియాలో కొత్త ఎపిసోడ్ ప్రారంభమవుతుందా? అనేది వేచి చూడాల్సి ఉంది.

More from Filmibeat

Read more about: director maruthi jr ntr prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X