Acharya Pre Release Event: ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ చూసా.. ఎలా ఉందంటే: మెహర్ రమేష్
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మెగాస్టార్ చిరంజీవి మొదటి సారి కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ఆచార్య సినిమా ఈనెల 29న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మెగా ప్రొడక్షన్ కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు దర్శక ధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథిగా వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి తో వర్క్ చేస్తున్నా మరి కొంత మంది దర్శకులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్న మెహర్ రమేష్ కూడా ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇక ఆయన తనదైన శైలిలో సినిమా గురించి మాట్లాడారు.
మెహర్ రమేష్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజవుతోంది అంటేనే అందరికీ ఒక మెగా ఫెస్టివల్ అని చెప్పవచ్చు. ఆచార్య దర్శకుడు కొరటాల శివ గారు అలాంటి మెగాస్టార్ సినిమాకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ను కూడా తీసుకువచ్చి అంచనాల స్థాయిని ఒక్కసారిగా పెంచేశారు. తప్పకుండా రేపు పొద్దున ఈ సినిమా అద్భుతమైన కథతో మంచి పాటలతో అలాగే మైమరిపించే యాక్షన్ ఎపిసోడ్స్ తో అందరూ పండగ చేసుకునేలా ఉండబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. ముఖ్యంగా మణిశర్మ గారు ఈ సినిమాకు చాలా మంచి సంగీతం అందించారు.

ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటలు అన్ని కూడా అద్భుతంగా వచ్చాయి. సినిమాటోగ్రాఫర్ తిరు పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన చాలా మంచి టెక్నీషియన్. దర్శకుడు కొరటాల శివ గారు ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రవెల్ యాక్షన్ ఎపిసోడ్ నాకు చూపించడం జరిగింది. ఇప్పటివరకు చిరంజీవిగారు ఎప్పుడూ చేయని ఒక యాక్షన్ ఎపిసోడ్ అదేనని నేను చెప్పగలను. అలాగే బలే బలే బంజారా సాంగ్ కూడా చూశాను. రెండు కళ్ళు సరిపోలేదు. శివుడు తన కుమారుడు కుమారస్వామితో డాన్స్ చేసినట్లుగా నాకు అనిపించింది.
హీరోల హవా భావాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. అందరి అభిమానుల తరహాలోనే నేను కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఈ సందర్భంగా నా మిత్రుడు కొరటాల శివకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ మంచి విజయాన్ని అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అని మెహర్ రమేష్ వివరణ ఇచ్చారు. ఇక ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి జోడీగా కాజల్ అగర్వాల్ నటించగా రామ్ చరణ్ తేజ్ కు జోడిగా పూజ హెగ్డే నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను గ్రాండ్ గా ఈనెల 29వ తేదీన విడుదల చేయబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో కూడా ఈ సినిమా అత్యధిక స్థాయిలో విడుదల అవుతుండటం విశేషం.


Click it and Unblock the Notifications











