God Father: క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్.. అతడి ఎంట్రీతో ఫ్యాన్స్‌కు పండగే

దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. అలా చాలా కాలం పాటు వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించిన ఆయన.. రాజకీయాల కోసం చాలా ఏళ్ల పాటు గ్యాప్ తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 'ఖైదీ నెంబర్ 150' మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. అది సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆ వెంటనే 'సైరా: నరసింహా రెడ్డి' అనే భారీ బడ్జెట్ మూవీని చేశారు. అయితే, ఇది అంతగా ఆకట్టుకోకపోయినా రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. ఇక, అప్పటి నుంచి వరుసగా సినిమాల మీద సినిమాలను ప్రకటిస్తూ ఈ సీనియర్ హీరో జెట్ స్పీడుతో ముందుకు వెళ్తోన్నారు.

మెగాస్టార్ చిరంజీవి కొద్ది రోజుల క్రితమే 'ఆచార్య' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటించాడు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మించాయి. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు నిరాశే మిగిలింది. ఫలితంగా ఈ మూవీకి రూ. 80 కోట్లకు పైగా నష్టాలు వచ్చాయి. దీంతో ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఆయన ఫోకస్ చేస్తున్నారు. ఇక, ప్రస్తుతం చిరంజీవి చేస్తోన్న చిత్రాల్లో ఒక 'గాడ్ ఫాదర్' ఒకటి. మలయాళ సీనియర్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీ రాజ్ సుకుమారన్‌ తెరకెక్కించిన 'లూసీఫర్'కు ఇది రీమేక్‌గా రూపొందుతోంది.

Director Moahan Raja Tweet About God Father Song

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'గాడ్ ఫాదర్' మూవీని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెలుగులో తెరకెక్కిస్తున్నాడు. పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ గత ఏడాదే మొదలైంది. అంతేకాదు, ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పలు షెడ్యూళ్లను కూడా చిత్ర యూనిట్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇటీవలే ముంబైలో జరిగిన ఓ షెడ్యూల్‌లో 'గాడ్ ఫాదర్' మూవీ కోసం బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా షూట్‌ను పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర డైరెక్టర్ మోహన్ రాజా అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు.

'గాడ్ ఫాదర్' మూవీలో సల్మాన్ ఖాన్, చిరంజీవి కలిసి ఓ పాటలో స్టెప్పులు వేయబోతున్నారు. దీన్ని ఇండియన్ మైకేల్ జాక్సన్‌గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా కొరియోగ్రాఫ్ చేయబోతున్నారని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. ఈ మేరకు ఓ ఫొటోను కూడా విడుదల చేసింది. ఇక, తాజాగా డైరెక్టర్ మోహన్ రాజా.. ప్రభుదేవాతో కలిసి దిగిన ఓ ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. దీనికి 'ఈరోజు ఎంతో ముఖ్యమైన రోజు. లెజెండరీ డైరెక్టర్, కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవాతో తొలిసారి కలిసి పని చేస్తున్నాను. ఇది గాడ్ ఫాదర్‌ సెట్స్‌లో తీసుకున్న ఫొటో' అంటూ పేర్కొన్నాడు. దీంతో ఇది సల్మాన్, చిరు మధ్య సాగే పాటే అని అంతా అనుకుంటున్నారు.

Director Moahan Raja Tweet About God Father Song

పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతున్న 'గాడ్ ఫాదర్' మూవీలో చిరంజీవి రాజకీయాల్లో చక్రం తిప్పే శక్తిగా కనిపించబోతున్నారు. ఈ సినిమాను ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ యువ విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇక, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రను చేస్తున్నాడు. అలాగే, నయనతార కీలక పాత్రను పోషిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X