Kalki 2898 AD శివరాత్రి స్పెషల్​ కల్కి ప్రభాస్ న్యూ లుక్ వచ్చేసిందోచ్​.. భైరవగా రెబల్​ స్టార్​!

మహానటి ఫేమ్​ నాగ్‌ అశ్విన్‌ - పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కాంబోలో రానున్న భారీ బడ్జెట్​ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ కల్కి 2898 ఏడీ. దీని కోసం కేవలం ఇండియన్ మూవీ లవర్సే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సినీ ప్రేమికులు​​ కూడా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్​​, సినిమా బ్యాక్​డ్రాప్ స్టోరీ ఏంటి? ఎవరెవరు నటిస్తున్నారు? అసలీ చిత్రానికి ఈ టైటిలే ఎందుకు పెట్టారనే విషయాలను చెప్పిన మూవీటీమ్ తాజాగా మూవీలోని ప్రభాస్ పాత్ర పేరును రివీల్ చేసింది. నేడు మహా శివరాత్రి సందర్భంగా ఈ విషయాన్ని తెలిపింది. పూర్తి వివరాలను స్టోరిలోకి వెళ్లి తెలుసుకుందాం..

ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రాలలో కల్కి సినిమా ఒకటి. భారీ బడ్జెట్​తో ఎక్స్​పెరిమెంట్​ మూవీగా తెరకెక్కిస్తున్నారు. పాన్ వరల్డ్​ మూవీగా రాబోతున్న ఈ చిత్రానికి అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఇండియన్ సినిమా హిస్టరీనే మార్చేస్తుంది. లేదంటే అట్టర్ ఫ్లాప్ అవుతుందని అంతా భావిస్తున్నారు. అయితే అసలీ సినిమా అనౌన్స్​మెంట్​ చేసినప్పటి నుంచి అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

Director Nag Ashwin Kalki 2898 AD Prabhas Role Revealed on Maha Sivaratri Special

పైగా ఈ చిత్రంలో ఎప్పుడైతే భారీ తారాగణం భాగస్వామ్యం అయ్యారో అంచనాలు పీక్స్​కు వెళ్లిపోయారు. ఎందుకంటే ఇండియన్ సినిమా హిహస్టరీలో ఉన్న లెజెండ్స్​ అందరూ ఇందులోనే ఉన్నారు. పలు భాషలకు చెందిన నటీనటులు ఇందులో నటిస్తున్నారు. బాలీవుడ్ నుంచి బిగ్ అమితాబ్ బచ్చన్​, కోలీవుడ్ నుంచి యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, టాలీవుడ్​ నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​, నటకిరీటీ రాజేంద్రప్రసాద్​తో పాటు హిందీ బోల్డ్ బ్యూటీస్​ బ్యూటీస్​ దీపికా పదుకొణె, దిశా పటానీ కూడా నటిస్తున్నారు.

మరో విషయమేమిటంటే ఈ చిత్రంలో కెమియో రోల్స్​ కూడా భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్​, యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకులు రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇలా ఇండియన్ సినిమాలోని ది గ్రేట్ పర్సన్​ అందరూ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు.

Director Nag Ashwin Kalki 2898 AD Prabhas Role Revealed on Maha Sivaratri Special

ఇంకా ఈ చిత్ర కథ మహా భారతం కాలం నుంచి మొదలై 2898తో పూర్తవుతుందని, గతంతో ప్రారంభమై భవిష్యత్తుతో ముగుస్తుందని రీసెంట్​గానే నాగ్ అశ్విన్ చెప్పారు. దీనిలో మొత్తం 6,000 సంవత్సరాల మధ్య జరిగే కథను చూపించనున్నట్లు చెప్పిన ఆయన ఈ కారణంగానే కల్కి అనే టైటిల్ పెట్టినట్లు కూడా చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మే 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అయితే నేడు మహా శివరాత్రి సందర్భంగా మూవీటీమ్​ అదిరిపోయే సర్​ప్రైజ్ ఇచ్చింది. మూవీలోని ప్రభాస్ పాత్రను పరిచయం చేస్తూ పేరును రివీల్ చేసింది. భైరవగా పరిచయం చేస్తూ ప్రభాస్​కు సంబంధించిన సరి కొత్త లుక్​ను పరిచయం చేసింది. కాశీ భవిష్యత్​ వీధుల్లో నుంచి భైరవను పరిచయం చేస్తున్నాం అని పేర్కొంది. ప్రభాస్ లుక్ కటౌట్ అదిరిపోయింది. డ్రెస్సింగ్ స్టైల్​, తలవెనక పోనీటైల్​ హెయిర్ స్టైల్​తో ధూమ్​ధామ్​గా కనిపించారాయన. ఓ పాడు బడ్డ ఫ్యాక్టరీలో దీన్ని చిత్రీకరించినట్లు అర్థమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X