Kalki 2: ప్రభాస్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చాడుగా.. కల్కి2 పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Kalki 2: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస హిట్స్ తో దూసుకపోతున్నారు. ఆయన నటించిన సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలు ఎలాంటి విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. కేవలం ఆరు నెలల గ్యాప్‌లోనే ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు చేశాయి. ఈ రెండు బ్లాక్ బ్లాస్టర్ సినిమాలకు సీక్వెల్స్ రాబోతున్నాయి. ఇటీవలే సలార్ సినిమా సీక్వెల్ షూటింగ్ ప్రారంభం కాగా.. తాజాగా కల్కి 2 మూవీకి సంబంధించిన ప్రభాస్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చాడు. కల్కి2 పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వివరాల్లోకెళ్తే..
ప్రభాస్ 'కల్కి 2898 AD' సినిమాను వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ సినిమా కోసం దాదాపు 600 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ మూవీకి యంగ్ డైరెక్టర్ అశ్విని దత్ దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు తెలుగులో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ఇదే. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా.. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. కల్కి 2898 ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే.

ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. పలు రికార్డులను క్రియేట్ చేసింది. పాన్ ఇండియాలో మూవీల్లో ఓ తెలుగు సినిమా సరికొత్త చరిత్ర రాసింది. ఈ భారీ బడ్జెట్ మూవీకి అన్ని భాషల్లోనూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. ఇలాంటి డిఫరెంట్ కంటెంట్ ని సక్సెస్ పుల్ మూవీగా తెరకెక్కించడం డైరెక్టర్ నాగ్ అశ్విన్ కే సాధ్యం. ఈ మూవీకి సీక్వెల్ గా వస్తున్న కల్కి 2 మూవీపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
తాజాగా ఓ అమరన్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ కల్కి పార్ట్ 2 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మంచి సినిమాలకు ప్రేక్షకులకు నుండి ఇప్పుడు సపోర్ట్ ఉంటుందని, ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్ వల్లనే కల్కి సూపర్ డూపర్ హిట్ అయిందని, ఇండస్ట్రీలో మైల్ స్టోన్ గా నిలిచింది అన్నారు. మీరు ఇచ్చిన సపోర్ట్ కు తాను ఎప్పుడు రుణపడి ఉంటానని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్నారు. ఈ సమయంలో కల్కి 2 అప్డేట్ గురించి ప్రశ్నించగా.. కల్కి 2 సినిమా రావడానికి చాలా సమయం పడుతుందని, షూటింగ్ జరుగుతుందంట ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.

ఈ సమయంలో స్టేజ్ పై పోస్టుగా ఉన్న సుమ మాట్లాడుతూ.. కల్కి రిలీజ్ ఎప్పుడు అని ప్రశ్నించగా మీరు గ్రహాలన్నీ ఏకమైనప్పుడు రిలీజ్ ఉంటుందని చెప్పారు ఆ మాట నిజం చేస్తూ ఆ సమయంలోనే రిలీస్ చేశారు కదా. మరి కల్కి కల్కి టు కి మధ్య ఏమైనా సినిమా తీస్తున్నారని ప్రశ్నించగా.. లేదు లేదంటూ సమాధానం ఇచ్చారు. పార్ట్ -2 ఒక్కటే రెండు, మూడు సినిమాలకు సమానం అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.
ఈ కామెంట్స్ పై కల్కి 2పై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఫర్ట్ పార్ట్ లో బిగ్ బీ అమితాబచ్చన్, తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన విషయం తెలిసిందే. మరి రెండవ భాగంలో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతుంది? కమల్ హాసన్ పాత్రను ఎలా డిజైన్ చేయబోతున్నారనేది ఇంట్రెస్టింగ్ మారింది. డైరెక్టర్ నాగ్ ఆశ్విన్ కామెంట్స్ బట్టి కల్కీ 2 ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారో అర్థమవుతోంది. అయినా నాగ్ అశ్విన్ ఆలోచనలను అందుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు.


Click it and Unblock the Notifications











