Kalki 2898 AD: స్టోరీ మొత్తం రివీల్ చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్.. అక్కడ మొదలై అలా ఎండ్ అవుతుందట!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించబోతుండగా.. పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి. సినిమాకు సంబంధించిన ఏ విషయం బయటకు వచ్చినా క్షణాల్లోనే వైరల్ గా మారుతుంది. అయితే తాజాగా ఈ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమా కథను రివీల్ చేశారు. అక్కడ మొదలై అలా ఎండ్ అవుతుందంటూ సినిమా విడుదలకు ముందే చెప్పేశారు. దీంతో ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్ తో పాటు అనేక మంది స్టార్ నటీనటులు కనిపించబోతున్నారు. ముఖ్యంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించబోతుంది. అలాగే బిగ్ బీ అమితా బచ్చన్, లోకనాయకుడు కనమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, సస్వత ఛటర్జీ, పశుపతి, గౌరవ్ చోప్రా, మండవ సాయి కుమార్, దిశా పటాని వంటి వాళ్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ముఖ్యంగా 600 కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ తారాగణం, భారీ బడ్జెట్ తో ఈ సినిమా వస్తుండడంతో.. ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అప్ డేట్ వైరల్ అవుతుంది. అభిమానులు అంతా కూడా ఈ చిత్రానికి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకునేందుకు మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ సూపర్ అప్ డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమాకు సంబంధించిన కథను రివీల్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమా 6000 ఏళ్ల పాటు కొనసాగుతుందని.. అంటే 6000 పాటు కొనసాగిన స్టోరీని ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు చెప్పారు. అంతేకాకుండా మహాభారతం స్టార్ట్ అయినప్పటి నుంచి కల్కి అవతారం వరకు మొత్తం విషయాలను చూపించబోతున్నట్లు చెప్పారు. నాగ్ అశ్విన్ యే నేరుగా ఈ విషయం చెప్పడంతో క్షణాల్లోనే వైరల్ గా మారింది.

ఇదంతా ఇలా ఉండగా.. ఈ సినిమా విడుదల తేదీన ఇప్పటికే ఫిక్స్ చేశారు. జగదీకవీరుడు, అతిలోక సుందరి, మహానటి, మహర్షి వంటి సినిమాలు విడదలై బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవగా.. అదే రోజు ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ కొడుతుంది.. బాక్సాఫీసు వద్ద ఎంత మేర కలెక్షన్ల వర్షం కురిపిస్తుందో చూడాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











