నగేష్ నారదాశి దర్శకత్వంలో ‘సముద్రుడు’
'శ్రీ సత్యనారాయణ స్వామి' అనే పౌరాణిక చిత్రంతో కెరీర్ మొదలు పెట్టిన దర్శకుడు నగేష్ నారదాశి... ఆ తర్వాత 'నిను చూసిన క్షణాన, కిల్లర్, బ్యాండ్ బాజా, లవ్ బూమ్, దేశదిమ్మరి' ఇలా రకరకాల జోనర్లలో సినిమాలు చేశారు. ఇటీవల కన్నడలో విరాజ్ అనే చిత్రంతో విజయం అందుకున్న ఆయన త్వరలో తెలుగులో 'సముద్రుడు' అనే చిత్రం చేయబోతున్నారు.
రమాకాంత్ హీరోగా రూపొందనున్న చిత్రం ఆగస్ట్ 14న అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభోత్సవం జరుపుకోనుంది. సముద్రం బ్యాక్ డ్రాపులో సినిమా ఉంటుంది కాబట్టి ఈ చిత్రానికి 'సముద్రుడు' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది.

ఈ సందర్భంగా నిర్మాత బడావత్ కిషన్ మాట్లాడుతూ.. ''మా దర్శకుడు నగేష్ నారదాశిగారు చెప్పిన కథ ఎంతగానో నచ్చింది. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో పూర్తి సినిమా ఉంటుంది. చిత్రాన్ని ఆగస్ట్ 14న ప్రారంభిస్తాం. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ముగించి, రెండవ షెడ్యూల్ చీరాల బీచ్ పరిసరాలలో షూటింగ్ చేసి పాటలను బ్యాంకాక్‌లో షూట్ చేస్తాము' అన్నారు.
మూడు షెడ్యూల్స్‌లో చిత్రీకరణ పూర్తి చేసి డిసెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. రమాకాంత్, మోనాల్, సిమర్, సుమన్, శ్రవణ్, ముఖ్తార్ ఖాన్, జబర్ధస్త్ శేషు, సుమన్ శెట్టి, సమ్మెట గాంధీ, గోపాలకృష్ణ, ప్రభావతి, డి.వి తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, సినిమాటోగ్రఫీ: వాసు, ఫైట్స్: సతీష్, పీఆర్వో: వీరబాబు, సహ నిర్మాతలు: శ్రీరామోజు జ్ఞానేశ్వర్, పి. రామారావు, సోములు, నిర్మాత: బడావత్ కిషన్, మాటలు: పార్వతీచంద్, కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: నగేష్ నారదాశి.


Click it and Unblock the Notifications











