Adipurush: అమృతం నుంచి కాపీ కొట్టిన ఆదిపురుష్ డైరెక్టర్.. అందుకే ఆ మార్పులు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒక్కో క్రేజీ డైరెక్టర్ తో సినిమా చేస్తూ భారీ అంచనాలు పెంచేస్తున్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఆదిపురుష్ సినిమా ఇటీవల విడుదలై తీవ్రమైన నెగెటివిటీని మూటగట్టుకుంది. ఈ సినిమాలోని పాత్రలు, గెటప్పులు, సన్నివేశాలు ఇలా ప్రతిదానిపై విమర్శలు వస్తున్నాయి. థియేటర్, ఓటీటీల్లో బ్యాన్ చేయమని డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆదిపురుష్ లోని ఓ పాత్రను అమృతం సీరియల్ నుంచి కాపీ కొట్టారా అని ట్రోలింగ్ మొదలైంది. ఆ వివరాల్లోకి వెళితే..

నటీనటులు: రామాయణం ఆధారంగా రూపొందిన ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్. శ్రీరాముడిగా ప్రభాస్ అలరించిన ఈ సినిమాలో పది తలల రావణుడిగా సైఫ్​ అలీ ఖాన్, సీతాదేవిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్​ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక భజరంగ్ హనుమంతుడి పాత్రలో మరాఠీ పాపులర్ నటుడు దేవదత్తా నాగే, లక్ష్మణుడిగా బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ చేశారు.

Adipurush

తానాజీ వంటి హిట్: ఆదిపురుష్ సినిమాను టీ సిరీస్ సంస్థ నిర్మాణంలో భూషణ్ కుమార్, క్రిష్ణ కుమార్, ప్రసాద్ సుతారియా, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్, ఓం రావత్ నిర్మాతలుగా వ్యవహరించారు. అలాగే తెలుగులో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ విడుదల చేశారు. తానాజీ వంటి హిట్ చిత్రం తెరకెక్కించిన బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ ఆదిపురుష్ మూవీకి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

Adipurush

అపహాస్యం చేశారు: జూన్ 16న ఎట్టకేలకు విడుదలైన ఆదిపురుష్ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది బాగుంది అంటే.. మరికొంతమంది రామాయణాన్ని అపహాస్యం చేశారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంకొంతమంది సినిమా బాగున్నా.. అది రామయణం మాత్రం కాదని కొత్త వాదన మొదలుపెట్టారు.

Adipurush

దానికి లింక్ చేసి: అయితే ఆదిపురుష్ సినిమాలోని చాలా వరకు పాత్రలపై ప్రేక్షకులు అసంతృప్తిగా ఉన్నారు. అందులో ముఖ్యంగా రావణుడిని చూపించిన విధానంపై పెదవి విరుస్తున్నారు. రావణుడి తలలు ఒకదానిపై ఒకటి ఉండే సీన్ పై బీభత్సమైన ట్రోలింగ్ నడుస్తోంది. అయితే ఈ సన్నివేశానికి ఒకప్పటి సూపర్ హిట్ సీరియల్ అమృతానికి లింక్ చేసి కాపీ కొట్టారని అంటున్నారు.

Adipurush

అలా పెట్టావేంటీ: అమృతం సీరియల్ లోని ఓ ఎపిసోడ్ లో అంతా రామాయణం నాటకం వేస్తారు. అందులో రావణుడి కోసం అమృతం పాత్ర పోషించిన శివాజీ రాజా పది తలలను సిద్ధం చేస్తాడు. అయితే అవి ఒకదానిపై ఒకటి పొడుగ్గా పెడతాడు. "ఏంటీ తలలు పైకి పెట్టావ్" అని రావణుడి పాత్రధారి అడుగుతాడు.

శాస్త్రం ఏం చెబుతుంది: "మన శాస్త్రం ఏం చెబుతోంది. తలలు నిటారుగా ఉండాలి. వంకరగా ఉండాలి. రెక్టాంగిల్ లో ఉండాలి. పిరమిడ్ లో టైప్ లో ఉండాలి అని ఏం చెప్పట్లేదు. మీకు ఎలా వీలైతే అలా పెట్టుకోమని చెప్పింది" అని అమృతం అంటాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్లు.. ఓం రావత్ దీన్నే కాపీ కొట్టుంటాడు, అందుకే అలా పాత్రలను నచ్చినట్లుగా మార్చేశాడంటూ నవ్వుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X