అక్కినేని హీరోతో ఆ సినిమా ఆగిపోలేదు.. క్లారిటీ ఇచ్చిన గీత గోవిందం డైరెక్టర్!
సాధారణంగా ఏ దర్శకుడైనా సరే బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్ కొట్టగానే వెంటనే మరో హీరోతో సినిమా స్టార్ట్ చేస్తుంటాడు. అయితే గీత గోవిందం సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న తరువాత దర్శకుడు పరశురామ్ మాత్రం తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో చాలా నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. ముఖ్యంగా రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా వెంటనే క్లారిటీ ఇవ్వడం లేదు.
ఇక ఫైనల్ గా నాగ చైతన్య ప్రాజెక్టు ఆగిపోయింది అని అందరూ అనుకుంటున్న సమయంలో ఆ సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చాడు. ఓ వైపు నాగ చైతన్య బిజీగా ఉండడంతో తను మరొక సినిమా స్టార్ట్ చేసే పనిలో ఉన్నట్లు చెప్పిన దర్శకుడు ఆ సినిమా చేసిన తరువాత నాగ చైతన్యతో నాగేశ్వరరావు అనే సినిమా చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. ఇక మహేష్ బాబుతో ఈ దర్శకుడు నెక్స్ట్ సినిమా చేయనున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే.

అయితే కథలో కొన్ని మార్పులు చేయాలని సూపర్ స్టార్ కోరడంతో ఆ ప్రాజెక్ట్ ని ఇంకా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం దర్శకుడు పరశురామ్ కథకు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ అనంతరం ఈ కాంబినేషన్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే యూఎస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథను ప్లాన్ చేసుకున్నారు. అయితే కరోనా కారణంగా అక్కడ షూటింగ్ నిర్వహించే ఛాన్స్ లేదు కాబట్టి స్క్రిప్ట్ లో మరిన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











