'శివ 143' సాంగ్ లాంచ్ చేసిన స్టార్ డైరెక్టర్.. చిన్న సినిమాకి పెద్ద ప్రోత్సాహం

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు ఎక్కువగా వస్తుండటం గమనిస్తున్నాం. అయితే వాటిలో ఏయే సినిమాలు ఎంతమేర రాణిస్తాయనేది మాత్రం ప్రశ్నార్ధకమే. అందుకే ఇలాంటి సినిమాల ప్రమోషన్స్ కోసమై స్టార్ డైరెక్టర్ల సహాయం తీసుకుంటున్నారు. ఈ బాటలోనే 'శివ 143' మూవీ కోసం డైరెక్టర్ పరశురామ్ సాయం తీసుకున్నారు యూనిట్ సభ్యులు. ఇటీవలే 'గీత గోవిందం' రూపంలో సూపర్ హిట్ అందించిన దర్శకుడు పరశురాం చేతుల మీదుగా 'శివ 143' సాంగ్ విడుదల జరిగింది.

ఈ సందర్భంగా పరశురాం మాట్లాడుతూ.. ''దర్శకుడు సాగర్ శైలేష్ నాకు చాలా కాలంగా తెలుసు. ట్రైలర్స్, సాంగ్స్ చూశాను.. చాలా బాగున్నాయి. ఈ రోజు చిన్న బడ్జెట్ సినిమాకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ వాటిని అధికమించి శివ 143 తీశారు. ఈ సినిమా ఇంత బాగా రావటానికి కారణం సీనియర్ నిర్మాత రామ సత్యనారాయణ గారు. ఆయనకు అన్ని కష్టసుఖాలు తెలుసు కాబట్టి.. ఆయన సినిమాను మంచి థియేటర్స్‌లో విడుదల చేసి సక్సెస్ చేస్తాడన్న నమ్మకం ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ మనోజ్ కొత్త వాడైనా కూడా బాగా చేసాడు. పాటలు బాగా వచ్చాయి. జనవరి 12న విడుదలకి ప్లాన్ చేయటం అంటే నాకు ఆశ్చర్యం వేసింది'' అని అన్నాడు.

Director Parasuram launches Shiva 143 song

నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ''డైరెక్టర్ పరుశురాం బిజీగా ఉన్నా మా సాంగ్ కోసం సమయం కేటాయించి విడుదల చేశారు, ఆయన సపోర్ట్ మరువలేనిది. అందుకు పరుశురాం గారికి ధన్యవాదాలు. మా 'శివ 143'చిత్రం జనవరి 12న సంక్రాంతికి విడుదలై సక్సెస్ సాధిస్తుందని నమ్ముతున్నా'' అన్నారు.

హీరో, డైరెక్టర్ శైలేష్ సాగర్ మాట్లాడుతూ.. ''మా యూనిట్‌కు సపోర్ట్ చేస్తున్న పరుశురాం గారికి థాంక్స్. పరుశురాం గారు విడుదల చేసిన సాంగ్ సినిమాలో సందర్భానుసారం వస్తుంది. ఆడియన్స్‌కు నచ్చే విధంగా ఉంటుంది. జనవరి 12న మా సినిమాను సపోర్ట్ చెయ్యమని ఆడియన్స్‌ను కోరుతున్నా'' అన్నాడు. ఈ చిత్రంలో సంజయ్ ఇదామ, శ్రీనాధ్ మాగంటి, అహల్య సురేష్, ప్రియ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X