KGF 2 రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. రాధేశ్యామ్ సినిమాతో పోటీ లేకుండా..
దేశవ్యాప్తంగా సినిమా అభిమానులు KGF 2 సినిమా కోసం ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గత ఏడాదే ఆ సినిమా వస్తుందని అనుకుంటే కరోనా దెబ్బ గట్టిగానే పడింది. దీంతో ఊహించని విధంగా వాయిదా వేయక తప్పలేదు. ఇక ఇప్పుడు అందరి చూపు సినిమా రిలీజ్ డేట్ పైనే పడింది. అయితే సడన్ గా సినిమాకు సంబంధించిన డేట్ పై దర్శకుడు ప్రశాంత్ క్లారిటీ ఇచ్చేశాడు.

లీక్ అవ్వడంతో..
యష్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల టీజర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే అనుకోని విధంగా టీజర్ ఒక రోజు ముందే సోషల్ మీడియాలో లీక్ అవ్వడం అందరిని షాక్ కు గురి చేసింది. ముందుగా కన్నడలో రిలీజ్ చేసి ఆ తరువాత తెలుగు హిందీ భాషల్లో విడుదల చేస్తారని మొదట ఊహాగానాలు వచ్చాయి. ఏదేమైనా సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది.

అంచనాలు మామూలుగా లేవు
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ కథానాయకుడిగా నటిస్తున్న ఆ సినిమా కోసం కేవలం కన్నడ ఆడియెన్స్ అనే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. తమిళ జనాల్లో కూడా సినిమాపై అంచనాలు భరిగానే ఉన్నాయి. ఇక టీజర్ ఆ అంచనాల డోస్ ను మరింత పెంచేసింది.

KGF 2 రిలీజ్ పై స్పందించిన టీమ్
ఇక ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో చాలా వరకు ఈ ఎడాది రానున్న సినిమాల తేదీలపై క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ఒకరి తరువాత మరొకరు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తుండడంతో అభిమానుకు KGF 2 డేట్ పై కూడా వివరణ కోరారు. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన కామెంట్స్ చాలానే వచ్చాయి. ఇక ఫైనల్ గా KGF టీమ్ ఆ విషయంపై వివరణ ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఈ రోజు అంటే శుక్రవారం సాయంత్రం 6:32గంటలకు సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వబోతున్నారు.
Recommended Video

రిలీజ్ ఎప్పుడంటే..
ఇక సినిమా రిలీజ్ ఎప్పుడనే విషయంలో ముందే కొన్ని ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. జూన్ లేదా జూలై లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే మే లో రాధేశ్యామ్ ప్రేక్షకుల ముందుకు రావచ్చు. అందుకే KGF పోటీ ఎక్కువగా లేకుండా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











