Salar లో ప్రభాస్ రోల్‌ను లీక్ చేసిన ప్రశాంత్ నీల్.. ఇదే ఫస్ట్ టైమ్ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ స్థాయి ఏ రేంజ్ కు పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ తర్వాత కూడా అంతకు మించి అనేలా సినిమాలతో వస్తాడు అని అభిమానులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. అయితే ప్రభాస్ మాత్రం ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలతో కూడా తీవ్రంగా నిరాశ పరిచాడు. అయితే ఈసారి ఎలాగైనా తన తదుపరి సినిమాతో ప్రేక్షకులకు సరికొత్త మాస్ ట్రీట్ ఇవ్వాలి అని చూస్తున్నాడు. ఇక ప్రస్తుతం అందరి దృష్టి అయితే సలార్ సినిమాపైనే ఉంది. ఇక కేజిఎఫ్ చాప్టర్ 2 ప్రమోషన్లో దర్శకుడు ప్రశాంత్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభాస్ ఆ సినిమాలో కనిపించబోతున్నాడు అని ఒక విషయాన్ని లీక్ చేశాడు.

ఊహించని డిజాస్టర్

ఊహించని డిజాస్టర్


రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తరువాత అదే తరహాలో సక్సెస్ అందుకోవాలి అని సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమా ఊహించని విధంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన రాధే శ్యామ్ సినిమా కూడా తీవ్ర స్థాయిలో నిరాశపరిచింది. దాదాపు సినిమా వంద కోట్ల వరకు నష్టాలను మిగిల్చిందని తెలుస్తోంది.

నెక్స్ట్ సినిమా..

నెక్స్ట్ సినిమా..

ఇక ప్రభాస్ తదుపరి సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాతో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రల్లో కనిపించబోతున్నాడు.

 KGF డైరెక్టర్ పై నమ్మకం

KGF డైరెక్టర్ పై నమ్మకం


ఇక ప్రభాస్ లైనప్ లో ఎన్ని సినిమాలు ఉన్నా కూడా అందరి ఫోకస్ మాత్రం ఎక్కువగా సలార్ సినిమాపైనే ఉంది. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ పై చాలా నమ్మకంతో ఉన్నారు. ప్రభాస్ రేంజ్ కు తగ్గట్టుగా ఊర మాస్ పవర్ఫుల్ పాత్రలో చూపిస్తాడు అని అనుకుంటున్నారు. కేజిఎఫ్ లో యష్ ను ఏ విధంగా ప్రజెంట్ చేశాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు తప్పకుండా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా. అందుకే అతనే రెబల్ స్టార్ ను కరెక్ట్ గా చూపిస్తాడు అని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

ప్రభాస్ క్యారెక్టర్

ప్రభాస్ క్యారెక్టర్

ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కేజిఎఫ్ చాప్టర్ 2 ప్రమోషన్ లో భాగంగా అప్పుడప్పుడు ప్రభాస్ సలార్ సినిమాపై కూడా కొన్ని విషయాలను చెబుతున్నాడు. రీసెంట్ గా ప్రభాస్ క్యారెక్టర్ గురించి కూడా అతను ఒక చిన్న పాయింట్ ను లీక్ చేయడంతో సోషల్ మీడియాలో ఆ విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

 వైలెంట్ పాత్రలో..

వైలెంట్ పాత్రలో..


దర్శకుడు ప్రశాంత్ నీల్.. ప్రభాస్ కోసమే ప్రత్యేకంగా సలార్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు చెప్పాడు. ఇంతవరకు తాను ఎప్పుడు కూడా ఇలాంటి క్యారెక్టర్ ను డిజైన్ చేయలేదు అని ప్రభాస్ చాలా భయంకరమైన పాత్రలో ఊహించని విధంగా వైలెంట్ గా కనిపిస్తాడు అని చెప్పాడు. సినిమాలో పవర్ ఫుల్ గా మాత్రమే కాకుండా అసలు ప్రభాస్ జాలీ దయా కరుణా లేకుండా విలన్స్ ను ఊచ కోతకొస్తాడు అని ప్రశాంత్ చెప్పకనే చెప్పేశాడు.

 గాయం కారణంగా..

గాయం కారణంగా..

ఇక ప్రశాంత్.. సలార్ సినిమాను రెండు భాగాలుగా తెరపైకి తీసుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి భాగానికి సంబంధించిన సగానికి పైగా షూటింగ్ పూర్తయింది త్వరలోనే మరొక కీలకమైన షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఇటీవల ప్రభాస్ గాయం కారణంగా మూడు నెలల వరకు బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు చెప్పడంతో ఆ షెడ్యూల్ ను వాయిదా వేసుకునే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక సినిమా ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది సంక్రాంతి అనంతరం ప్రేక్షకుల ముందుకు తీసుకు రావచ్చు అని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X