Hanuman: హనుమాన్‌లో ప్రభాస్ కాకుండా తేజానే ఎందుకు తీసుకొన్నానంటే? అసలు విషయం చెప్పిన డైరెక్టర్

తేజ సజ్జ.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా బాల నటుడిగా సినీ రంగంలో అడుగు పెట్టి.. అద్భుతంగా డైలాగ్ లు చెప్పిన ఇతడు.. ప్రస్తుతం హీరోగాను అదరగొడుతున్నాడు. చిన్నప్పుడే స్టార్ హీరోల అందరితో కలిసి పని చేసిన ఇతడు... వారి చూసే యాక్టింగ్ లో మెలుకువలు నేర్చుకున్నట్లు అనిపిస్తుంటుంది. ముఖ్యంగా 1998లో చూడాలని ఉంది సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈయన బాల నటుడిగానే దాదాపు 26కు పైగా చిత్రాల్లో కనిపించాడు. ఇక 2019లో ఓ బేబీ సినిమా ద్వారా లీడ్ రోల్ లోనూ చేశాడు. ఇక జాంబీ రెడ్డి చిత్రం ద్వారా నేరుగా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి వరుసగా చిత్రాలు చేసుకుంటూ వస్తున్నాడు.

ఇష్క్, అద్బుతం వంటి చిత్రాలతో 2021లో సందడి చేసిన ఈయన తాజాగా హును మాన్ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా హీరోగా రాబోతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ రోజే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ముఖ్యంగా స్పెషల్ గా ఓ ఈవెంట్ పెట్టుకునీ మరీ ఈ చిత్రం ట్రైలర్ ను లాంచ్ చేశారు. అలాగే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అనేక విషయాలకు సమాధానాలు చెప్పారు. ఇటు హీరోతా పాటు డైరెక్టర్ కూడా అన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చారు.

హనుమాన్ సినిమా చేస్తున్నప్పుడు మీరైమైనా నిష్ఠ పాటించారా అంటూ రిపోర్టర్లు అడగ్గా... తేజా అవును అని చెప్పాడు. గతంలో అంటే చిన్నప్పుడు తాను శ్రీరామదాసు వంటి సినిమాలు చేస్తున్నప్పుడు ఎలా అయితే నిష్ట పాటించామో ఇప్పుడు కూడా అలాగే నిష్ట పాటిస్తూనే.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే సినిమా చేశామని చెప్పుకొచ్చాడు. ట్రైలర్ లాంట్ ఈవెంట్ లో కూడా హనుమాన్ ఫొటో బ్యాగ్రౌండ్ లో ఉందని... చెప్పులు కూడా వేసుకోకుండానే స్టేజీపైకి వచ్చామని క్లారిటీ ఇచ్చాడు. తాము చాలా భక్తి, శ్రద్ధలు.. జాగ్రత్తలతోనే ఈ చిత్రాన్ని చేసినట్లు వివరించాడు.

Director Prashanth Varma Clarrity For Choosing Teja as theHhero instead of Prabhas in the Movie Hanuman

అలాగే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ సినిమా చూస్తే మీకు అంతా అర్థం అయిపోతుందని అన్నారు. హనుమంతుడి భార్య సువర్చల దేవిని ఈ సినిమాలో మీరు చూపించారా, హీరోయిన్ ను అలా ఎలా చూపించగలిగారు అంటూ అడగ్గా... ఇది కూడా సినిమా చూస్తేనే అర్థం అవుతుంది అంటూ క్లారిటీ ఇచ్చాడు. హనుమంతుడు అనగారే భారీ దేహం.. విశ్వమంత బలవంతుడు అనిపించేలా ఉంటుంది కదా... ఇలా సన్నగా ఉన్న తేజాను ఎలా హీరోగా తీసుకోగలిగారు.. ప్రభాస్ ను తీసుకోవచ్చు కదా అంటూ ఓ రిపోర్టర్ అడిగాడు. అందుకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ షాకింగ్ సమాధానం చెప్పారు.

Director Prashanth Varma Clarrity For Choosing Teja as theHhero instead of Prabhas in the Movie Hanuman

ప్రభాస్ కు ఎలాంటి పవర్స్ రావాల్సిన అవసరం లేదని.. నిన్న సలార్ ట్రైలర్ చూస్తుంటేనే ఆయన శక్తి ఏంటో అర్థం అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. ఆయనకు హనుమంతుడు బలం ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదని.. కానీ సన్నగా ఉన్న తేజా లాంటి వాడికి.. ఆ ఆంజనేయ స్వామి ఇచ్చే శక్తి కావాలని చెప్పుకొచ్చాడు. అందుకే ప్రభాస్ ను కాకుండా హీరోగా తేజ సజ్జను తీసుకున్నట్లు స్పష్టం చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X