హనుమాన్ డైరెక్టర్‌తో బాలకృష్ణ.. ఇప్పటికీ ఎవరూ టచ్ చేయని జోనర్‌లో సినిమా!
యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. తేజ సజ్జ హీరోగా వస్తున్న హనుమాన్ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పోస్టర్లు, పాటలు అని విశేషంగా ఆకట్టుకున్నాయి. హనుమాన్ సినిమాపై భారీగా బజ్ ఉంది. ఈ చిత్రం విడుదల అవుతున్న నేపథ్యంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో పాటు సినిమా సినిమాలో నటించిన నటీనటులు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు.
తాజాగా ప్రశాంత్ వర్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినిమా విశేషాలు పంచుకున్నారు. హనుమాన్ సినిమా గురించిన విషయాలతో పాటు గత కొన్ని రోజులుగా ప్రశాంత్ వర్మ - బాలయ్య బాబు కాంబోపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దానిపై సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు ప్రశాంత్ వర్మ. బాలయ్య బాబుకు తాను ఓ కథ గురించి చెప్పిన విషయం చెప్పారు.
Recommended Video


తాను నరేట్ చేసిన కథపై బాలయ్య చాలా ఎగ్జైట్ అయ్యారని అన్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కనుందన్నది మాత్రం తన చేతుల్లో లేదని ప్రశాంత్ వర్మ చెప్పారు. స్టార్ హీరోలు ఎప్పుడు కాల్షీట్లు ఇస్తే అప్పుడే షూటింగ్ చేయగలుగుతామని అన్నారు ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మ - బాలయ్య బాబు కాంబోలో వచ్చే సినిమా పూర్తిగా కొత్త జోనర్‌లో ఉంటుందని చెప్పుకొచ్చారు ప్రశాంత్ వర్మ. బాలకృష్ణ ఇప్పటి వరకు ఎన్నో జోనర్ సినిమాలు చేసినప్పటికీ.. ఈ జోనర్ ను ఎప్పుడూ టచ్ చేయలేదని అన్నారు ప్రశాంత్ వర్మ.

అసలు భారత్ లోనే ఈ జోనర్ లో ఇప్పటి వరకు ఎలాంటి సినిమా రాలేదని చెప్పుకొచ్చారు ప్రశాంత్ వర్మ. అలాంటి ఓ కొత్త జోనర్ లో బాలయ్య బాబు సినిమా ఉండనుందని అన్నారు. ఆ జోనర్ ఏంటి అనే కదా డౌట్. అయితే ఆ డౌట్ ను క్లారిఫై చేయలేదు ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్. తన జోనర్ గురించి బయటకు చెబితే.. తాను బాలయ్య బాబుతో ఆ సినిమా తెరకెక్కించే లోపే ఎవరైనా ఆ జోనర్ లో మూవీ చేస్తారని ఆ ప్రశ్నకు బదులు ఇవ్వలేదు ప్రశాంత్ వర్మ. బాలయ్య బాబుతో తెరకెక్కించనున్న మూవీకి సంబంధించిన పోస్టర్ ఇప్పటికే డిజైన్ అయిపోయిందని చెప్పారు హనుమాన్ మూవీ డైరెక్టర్. పోస్టర్ కు సంబంధించి ఎలాంటి వివరాలు రివీల్ చేయలేదు.


Click it and Unblock the Notifications











