హనుమాన్ టైటిల్ చిరంజీవిదా?.. మెగాస్టార్‌కు తెలియకుండానే ప్రశాంత్ వర్మ కొట్టేశాడా?
తేజ సజ్జా హీరోగా రాబోతున్న తాజా చిత్రం హనుమాన్ గురించి అందరికీ తెలిసిందే. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికీ భారీ అంచనాలు నమోదు అయ్యాయి. విజ్యువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆంజనేయ స్వామి లుక్ అయితే అదిరిపోయింది. ట్రైలర్ చూస్తుంటేనే ఈ విషయం అర్థం అయిపోతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఆంజనేయ స్వామి ఓ దేవుడిగా కంటే ఓ సూపర్ హీరోగా భావించినట్లు ముందు నుంచీ డైరెక్టర్ చెప్పుకొస్తున్నారు. అలాగే అసలు ఈ సినిమా కథ ఎలా పుట్టింది, టైలిల్ ఎలా వచ్చిందో ప్రశాంత్ వర్మ ఈరోజు రివీల్ చేశారు. ఈ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో తేజ సజ్జా హీరోగా కనిపించబోతుండగా.. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీనులు ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే అద్భుతమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నారు.

జనవరి 12వ తేదీన తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో విడుదల చేయనున్నారు. పాన్ వరల్డ్ గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అథితిగా పాల్గొన్నారు. ఈక్రమంలోనే డైరెక్టర్ హనుమాన్ టైటిల్ గురించి షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ టైటిల్ ను చిరంజీవి నుంచి ఆయనకు తెలియకుండా తీసుకున్నట్లు తెలిపారు. దీని గురించే చిరంజీవి వివరించారు.
చిరంజీవి ముందు నుంచి ఆంజనేయ స్వామి భక్తుడు కాగా.. ఓ కార్యక్రమంలో అదే విషయం చెప్పాడట. సమంత హోస్ట్ గా వచ్చిన సామ్ జామ్ ప్రోగ్రాంలో మీకు నచ్చిన శక్తి ఏదని అనగా.. చిరు ఆంజనేయ స్వామి పేరు చెప్పారట. అలా కాదు సూపర్ హీరోస్ లలో అని సామ్ అనగానే.. హను మాన్ అని మెగాస్టార్ వివరించారట. అది చూసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దాన్నే తన సినిమాకు పేరుగా పెట్టుకోవాలని భావించారట. దాన్నే టైటిల్ గా పెట్టి సినిమా కూడా తీసేశారు. అయితే తన నోటి వెంట వచ్చిన ఆ పదాన్ని టైటిల్ గా పెట్టుకున్నారని తనకు తెలియదని చిరు వెల్లడించారు.

కానీ యాధృశ్చికంగా తన నోటి వెంట వచ్చిన ఆ పేరునే సినిమా టైటిల్ గా పెట్టడం తనకు చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. తనకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం అని.. కాకపోతే తానెప్పుడు గుడులకు వెళ్లడం, పూజలు చేయడం వంటివి చేయనని కూడా అన్నారు. కానీ మనసులోని ఆంజనేయ స్వామిని తలుచుకుని తన కష్టాల గురించి చెప్పుకుంటే అవన్నీ తొలగిపోతాయని వివరించారు. చిన్నప్పటి నుంచి ఆంజనేయ స్వామినే ఆరాధ్య దైవంగా కొలుస్తున్నట్లు కూడా వెల్లడించారు చిరంజీవి.


Click it and Unblock the Notifications











