అకిరా టాలీవుడ్ ఎంట్రీ.. పూరి జగన్నాథ్‌కు షాకిచ్చిన రేణుదేశాయ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ పెద్దవాడవుతున్న కొద్దీ జనాల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్నాడు. అతని హైట్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. ఇక రీసెంట్ గా పూరి జగన్నాథ్ కూడా అకిరా కటౌట్ చూసి షాకయ్యాడు. బద్రి సినిమా వచ్చి 20 ఏళ్లవుతున్నా సందర్భంగా పూరితో రేణూ దేశాయ్ లైవ్ లో చాట్ చేస్తూ అకిరా గురించి మాట్లాడారు.

బద్రి జ్ఞాపకాలు..
బద్రి సినిమా విడుదలై నిన్నటితో 20 ఏళ్ళు దాటడంతో దర్శకుడు పూరి జగన్నాథ్ ఆ సినిమా హీరోయిన్ రేణూ దేశాయ్ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సినిమా గురించి అనేక జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రేణూ పాజిటివ్ గా మాట్లాడుతూ షూటింగ్ లొకేషన్స్ లో అప్పుడు పవన్ కళ్యాణ్ తో ఉన్న ఫొటోస్ ని షేర్ చేసుకున్నారు.

అకిరా కటౌట్ చూసి షాకైన పూరి..
సినిమా గురించే కాకుండా పూరి జగన్నాథ్.. రేణూ దేశాయ్ యొక్క పిల్లల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. అయితే ఇటీవల అకిరా ఫోటో చూశానని చెప్పిన పూరి అతని హైట్ మాములుగా లేదని అంతకంటే ఎక్కువ హైట్ పెరగవద్దని సరదాగా మాట్లాడారు. అదే విధంగా అకిరాను, ఆద్యను చూడాలని ఉందని లాక్ డౌన్ అనంతరం తప్పకుండా కలుద్దామని పూరి జగన్నాథ్ వివరణ ఇచ్చారు.

అకిరా సినీ కెరీర్..?
అకిరా నందన్ అనగానే అతని మొదటి సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఒక రేంజ్ లో ఉహించుకుంటున్నారు. అయితే అకిరాకు మాత్రం ప్రస్తుతం సినిమా హీరో అవ్వాలనే ఇష్టం లేదని రేణూ దేశాయ్ పూరి జగన్నాథ్ కు తెలియజేశారు. రేణూ దేశాయ్ అకిరా గురించి చెప్పిన విధానం అభిమానుల్లో కాస్త ఆందోళనకు గురి చేస్తోంది. ఎందుకంటే పవన్ కొడుకుని బిగ్ స్క్రీన్ పై చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు.
Recommended Video

టాలీవుడ్ నెంబర్ వన్ హైట్..
ఒకవేళ అకిరా గనక టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే హైట్ లో అతనే నెంబర్ వన్ అని చెప్పవచ్చు. ఇప్పటివరకు హీరోల్లో వరుణ్ తేజ్ మాత్రమే అందరికంటే పొడవైన హీరో.. ఇక అకిరా మాత్రం 16 ఏళ్లకే 6.4కి చేరిపోయాడు. వరుణ్ కంటే పెద్దవాడే ఎత్తులో. మెగా ఫ్యామిలీ గర్వపడే విధంగా తండ్రి లాగే సింపుల్ గా ఉండే అకిరా సినిమాల గురించి అయితే ఆలోచించడం లేదట. మరి ఫ్యూచర్ లో ఏమైనా సినిమాల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తాడేమో చూడాలి.


Click it and Unblock the Notifications











