Liger సినిమా కోసం మొదట అనుకున్న హీరోయిన్ వేరు.. ఆమె ఎందుకు చేయలేదంటే: పూరి జగన్నాథ్

డేరింగ్ అండ్ డాష్ అండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కెరీర్ లోనే మొట్టమొదటిసారి ఒక బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా సినిమాను వెండితెరపైకి తీసుకురాబోతున్నాడు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో తీసిన లైగర్ సినిమా ఆగస్టు 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలను పెరుగుతున్న సమయంలో చిత్రం యూనిట్ సభ్యులు కూడా అనేక విషయాలను షేర్ చేసుకుంటూ మరింత ఆసక్తిని కలిగిస్తున్నారు. అయితే లైగర్ సినిమాలో మొదట అనన్య పాండే కంటే ముందే మరొక హీరోయిన్ ఫైనల్ చేయాలని అనుకున్నారట. కానీ ఆమెతో వర్కౌట్ కాలేదట. ఇంతకు లైకర్ సినిమాలో అవకాశం మిస్ చేసుకున్న ఆ హీరోయిన్ ఎవరు అనే విషయంలో కూడా పూరి జగన్నాథ్ క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలలోకి వెళితే..

పూరి కెరీర్ లోనే..

పూరి కెరీర్ లోనే..

ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో ఎలాగైనా ఒక సినిమాను చేయాలి అని చాలా రోజులపాటు స్క్రిప్ట్ పై కూర్చున్నాడు. పూరి జగన్నాథ్ తన కెరీర్ లో ఏ సినిమా అయినా సరే చాలా తొందరగా పూర్తి చేసిన సందర్భాలు ఎక్కువ. అంతేకాకుండా స్కిప్ట్ కూడా రెండు మూడు వారాల్లో ఫినిష్ చేయగల సత్తా ఉన్న దర్శకుడు. అలాంటిదే లైగర్ సినిమా కోసం మాత్రం ఆయన చాలా నెలలు స్క్రిప్ట్ పైన కూర్చున్నాడు. అలాగే షూటింగ్ కోసం కూడా కాస్త ఎక్కువ సమయం తీసుకున్నారు. పూరి జగన్నాథ్ కెరీర్ లోనే అత్యధిక ఎక్కువ టైం తీసుకుని షూట్ చేసిన సినిమా కూడా ఇదే.

 విజయ్ హై వోల్టేజ్

విజయ్ హై వోల్టేజ్

ఇక డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలను ఎక్కువగా చేసే విజయ్ దేవరకొండ పవర్ఫుల్ బాక్స్ ఇమేజ్ కోసం కూడా ఎప్పటినుంచో ట్రై చేస్తున్నాడు. ఇక అతనికి పూరి జగన్నాథ్ దొరకడంతో స్క్రీన్ పై తనను తాను సరికొత్తగా పరిచయం చేసుకోబోతున్నాడు. ఈ సినిమా కోసం పూర్తిస్థాయిలో తన ఫిట్నెస్ ను కూడా మార్చేశాడు. ఫుల్ వర్కౌట్స్ చేసి సరికొత్త లుక్కుతో ఆశ్చర్య పరుస్తున్న విజయ్ దేవరకొండ సినిమాలో కూడా హై వోల్టేజ్ లుక్కుతో కనిపిస్తాడు అని తెలుస్తోంది.

 హీరోయిన్ విషయంలో

హీరోయిన్ విషయంలో

ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే నటించిన విషయం తెలిసిందే. ఈ బ్యూటీ కూడా ఇదివరకే బాలీవుడ్ లో మంచి గుర్తింపును అందుకుంది. ఇక విజయ్ దేవరకొండతో సినిమా అనగానే ఆమె మరో ఆలోచన లేకుండా ఒప్పుకుందట. అయితే ఆమె కంటే ముందే దర్శకుడు పూరి జగన్నాథ్ మరొక హీరోయిన్ కోసం కూడా చర్చలు జరుపినట్లు చెప్పారు.

జాన్వీ కపూర్.. ఎందుకు చేయలేదంటే?

జాన్వీ కపూర్.. ఎందుకు చేయలేదంటే?

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు పూరి జగన్నాథ్ అనన్య పాండే కంటే ముందు ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ను అనుకున్నట్లుగా తెలియజేశాడు. మొదట లైగర్ కథ గురించి కరణ్ జోహార్ కి తెలియజేశాడట. అయితే అప్పటికే జాన్వీకపూర్ కొన్ని సినిమాలతో బిజీగా ఉండడం వలన డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయిందట. ఇక ఆ తర్వాత కరణ్ సలహా మేరకు అనన్య పాండే ను ఫైనల్ చేసినట్లుగా పూరి జగన్నాథ్ వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X