Puri Jagannath: అందరూ ప్రేమించుకొనేది ఆ పని కోసమే.. !

పూరీ జగన్నాథ్.. ఈ పేరు చాలు సూపర్ బ్లాక్ బస్టర్ హిట్లు అలా మెదళ్లలోకి వచ్చేస్తుంటాయి. జెట్ స్పీడ్ తో సినిమాలు తీసి, హీరో క్యారెక్టర్ తో, డైలాగ్స్ తో విజిల్స్ వేయించే దర్శకుడాయన. కానీ కాలం కలిసి రాక తన సినిమాలు హిట్లు కాలేక అలా నెమ్మదిగా ఫేడవుట్ అవుతున్నాడని విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే పూరీ.. ఆ విమర్శలకు తగ్గట్లే చాలా సైలెంట్ అయిపోయారు. ఎప్పటికప్పుడు తాజా అంశాలపై స్పందించే పూరీ కొన్నాళ్లుగా నోరు మెదపడం లేదు. ముఖ్యంగా ఆయన ఓ సినిమా చేస్తున్నట్లు తెలిసినా పెద్దగా ఆయన గురించి ఏమీ తెలియట్లేదు.

కానీ ఈ మధ్య చాలా యాక్టివ్ అయ్యారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. చాలా రోజుల తర్వాత యూట్యూబ్ లో పూరీ మ్యూజింగ్స్ లో ఛానల్ లో వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. తనకు నచ్చిన టాపిక్ పై మాట్లాడుతూ.. ప్రజలకు అనేక విషయాల గురించి చెప్పుకొస్తున్నారు. అయితే తాజాగా ఆయన ప్రేమ గురించి, లవ్ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడారు. అయితే పూరీ మాట్లాడిన అంశమే చర్చనీయాంశంగా మారింది. మరి ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Director Puri Jagannath Shocking Comments about Love And Relation Check Details

చాలా మంది లవ్ ఫెయిల్యూర్ ని చూస్తారని.. అలా జరిగిన తర్వాత తినకుండా, ఏ పనీ చేయకుండా.. ఎప్పుడూ ఏడుస్తూ, బాధ పడుతూ, ఏదో కోల్పోయినట్లు ఉంటారని తెలిపారు. ఈక్రమంలోనే మద్యానికి బానిసై మరింత ఎక్కువగా ఏడుస్తుంటారు. తమ ప్రేమను ఆ అమ్మాయి అర్థం చేసుకోలేదంటూ రచ్చ చేస్తారని.. అయితే ఇదంతా ప్రేమ కాదని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు. నిజానికి మీరు ప్రేమ అనుకుంటున్న ఇది ఇగో అని.. మీకు ఆ అమ్మాయి దక్కలేదన్న ఉక్రోషంతోనే ఇలా చేస్తారంటూ తెలిపారు. ఆ అమ్మాయి కోసం.. పాపం ఈ అబ్బాయి తాగుబోతు అయ్యాడని అంతా అనుకోవాలనే అలా చేస్తారంటూ వివరించారు.

అయితే మీరు ఆ అమ్మాయిని ప్రేమించిన దానికంటే ఎక్కువగా.. మిమ్మల్ని మీ అమ్మ ప్రేమిస్తుందని.. కానీ ఎప్పుడైనా ఆమె కోసం కత్తి పెట్టి చేయి కోసుకున్నారా అంటూ పూరీ ప్రశ్నించారు. మన ప్రేమలన్నీ సెక్స్ రిలేటెడ్ అని ఎప్పుడూ అందమైన అమ్మాయినే ఎందుకు ప్రేమిస్తారని కూడా అన్నారు. మరి కాళ్లు, చేతులు లేని అమ్మాయిలను ఎందుకు ప్రేమించరని అడిగారు. అలాగే నిజంగానే మీరు ఆమెను ప్రేమించి ఉంటే తన నిర్ణయాన్ని కూడా గౌరవించాలని చెప్పుకొచ్చారు. నిజంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఏంజెలినీ జూలియెట్ లు కూడా పెళ్లయ్యాక.. బెడ్ అటొకరు, ఇటొకరు తిరిగే పడుకున్నారని తెలిపారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లలో చాలా మంది రెండేళ్లకు మించి సరిగ్గా కాపురం చేయలేరని, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లంతా ఇంకో అమ్మాయిని చూడమని ప్రామిస్ చేయగలరా అంటూ ప్రశ్నించారు. నిజంగానే అమ్మాయి లవ్ లో ఫెయిల్ అయితే.. ఇలాగే ఏడుస్తూ ఉండని.. తన జీవితంలో తాను ముందుకు వెళ్తుందని తెలిపారు. నిజంగానే అమ్మాయి ప్రేమను పొందలేకపోతే ఏడవకుండా.. జీవితంలో ముందుకు వెళ్తూ.. కెరియర్ లో సక్సెస్ సాధించమని చెప్పారు. ఇలా లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్ లో ఏడుస్తూ, రచ్చ చేస్తే... కొన్నేళ్ల తర్వాత వాటినే మీరు జోకులుగా చెప్పుకుంటూ నవ్వుకుంటారని అన్నారు. ఇలా జీవితంపై సరైన సందేశం ఇచ్చిన పూరీ తనలోని కొత్త కోణాన్ని చూపిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X