రాధేశ్యామ్ రిలీజ్ ఆలస్యం అవుతుందని కోవిడ్ కంటే ముందే అతను చెప్పాడు: దర్శకుడు రాధాకృష్ణ
బాహుబలి సినిమా అనంతరం ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మరొక సోలో సక్సెస్ అందుకోవాలి అని ప్రభాస్ సాహో సినిమాతో వచ్చాడు. కానీ ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. నిర్మాతలు అయితే సేఫ్ జోన్ లోకి వచ్చేసారు కానీ చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్లు కూడా ఈ సినిమా కారణంగా నష్టపోయారు. ఇక ఆ తర్వాత ప్రభాస్ ఎవరూ ఊహించని విధంగా ఒక ప్యూర్ లవ్ స్టోరితో ప్రేక్షకుల ముందుకు రావాలని సిద్ధమయ్యాడు. ఇక రాధేశ్యామ్ సినిమాను ఏడాదిలో ఫినిష్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ సినిమా అనుకోని విధంగా ఆలస్యం అయ్యింది.

18 ఏళ్ళ క్రితం..
సాహో సినిమాతో పాటే రాధేశ్యామ్ సినిమాను కూడా మొదలు పెట్టాడు. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. జిల్ సినిమాతో యూవీ క్రియషన్స్ లో మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు రాధాకృష్ణ ప్రభాస్ కు మంచి కథను చెప్పి ఒప్పించాలని అనుకున్నాడు. రాధేశ్యామ్ సినిమా కథ కూడా 18 ఏళ్ల క్రితమే ఒక రచయిత దగ్గర తీసుకున్నాడట.

క్లైమాక్స్ కోసం..
అయితే సినిమా కథ రాసుకున్న తర్వాత క్లైమాక్స్ కోసం చాలా కష్ట పడాల్సి వచ్చేదట. ఇండియాలో ఉన్న టాప్ రైటర్స్ సలహాలు కూడా తీసుకున్నాడట. కానీ ఎంత ట్రై చేసినా కూడా క్లైమాక్స్ విషయంలో మాత్రం సంతృప్తి చెందలేకపోవటంతో ఫైనల్ గా తన గురువు చంద్రశేఖర్ ఏలేటి ద్వారా సినిమా పూర్తి కథను సిద్ధం చేసుకున్నాడట. రాధేశ్యామ్ సినిమా తెరపైకి వచ్చిన తర్వాత సరిగ్గా ఏడాది లోపు ఫినిష్ చేయాలని అనుకున్నారు.

నాలుగేళ్ళ క్రితమే..
ఇక అంతకంటే ముందే దర్శకుడు రాధాకృష్ణ సినిమాలోని కొన్ని అంశాల కోసం మహారాష్ట్ర తమిళనాడులోని ప్రముఖ జ్యోతిష్యులను కూడా కలిసినట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు. అయితే తమిళనాడులోనే ఒక జ్యోతిష్యుడు రాధేశ్యామ్ సినిమా అంత త్వరగా ఫినిష్ అవ్వదు అని ఈ సినిమా తప్పకుండా 2022 మొదట్లోనే విడుదలవుతుందని నాలుగేళ్ల క్రితమే చెప్పాడట.

ఎలా చెప్పాడో అర్థం కాలేదు
అంటే అప్పటికి కూడా ఇంకా కరోనా లాక్ డౌన్ గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదు. ఈ విషయాలను ఎలా గ్రహించి చెప్పాడో తెలియదు గాని తను కూడా ఈ విషయాన్ని నమ్మాలో లేదో కూడా అర్థం కాలేదని రాధాకృష్ణ వివరణ ఇచ్చాడు. ఏదేమైనా కూడా రాధేశ్యామ్ సినిమా ఒక డెస్టిని తరహాలో ముందుకు సాగినట్లు తెలియజేశాడు.

ఫైట్ సీన్స్ ఉండవు.. కానీ..
ఇక ఈ సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది అని చెబుతూ సినిమాలో పెద్దగా ఫైట్ సీన్స్ ఉండవని, కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రేమలో మునిగి తేలుతారని అన్నాడు. ప్రేమ అనే పదం ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా నచ్చుతుంది అని రాధాకృష్ణ తెలియజేశాడు.
ఇక సినిమాలో ప్రతి ఒక్క పాత్ర కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది అని ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశం అందరినీ ఆకట్టుకుంటుంది అని కూడా రాధాకృష్ణ వివరణ ఇచ్చాడు. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 14 న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. మరి బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ ఎలాంటి స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











