రాధేశ్యామ్ విడుదలపై మరింత అనుమానం.. మరోసారి క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో రాధేశ్యామ్ టాప్ లిస్టులో ఉంది అనే చెప్పాలి. మొత్తానికి RRR సినిమా వాయిదా పడటంతో ఆ తర్వాత రాబోయే కొత్త సినిమా రాధే శ్యామ్ పై అందరి ఫోకస్ పడింది. అయితే ఈ సినిమా విడుదలయ్యే వరకు కూడా నమ్మకం లేదు అని ప్రస్తుతం అనేక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక సోషల్ మీడియా ద్వారా ఇటీవల రాధాకృష్ణ సినిమా వాయిదా పడుతుందా అనే అనుమానాలకు మరొకసారి క్లారిటీ ఇచ్చాడు.

 అదే బాటలో రాధేశ్యామ్?

అదే బాటలో రాధేశ్యామ్?

దర్శక ధీరుడు రాజమౌళి RRR సినిమాను తెరపైకి తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేశాడు. ఆ సినిమా ఫైనల్ గా జనవరి 7వ తేదీన తప్పకుండా వస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ పరిస్థితుల ప్రభావం వలన ఆ సినిమా కూడా వాయిదా పడక తప్పలేదు. ఇక రాధేశ్యామ్ కూడా అదే బాటలో వాయిదా వేసుకుంటుంది అని అనేక రకాల అనుమానాలు వచ్చాయి.

 తేడా వస్తే..

తేడా వస్తే..

అయితే ఇప్పటి వరకు కూడా చిత్రయూనిట్ సభ్యులు సినిమా 14వ తేదీన వస్తుంది అని గట్టిగానే చెబుతున్నారు. అయితే ఎంత చెప్పినా కూడా తేడా వస్తే మాత్రం సినిమా కూడా వాయిదా పడవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే తమిళనాడు కర్ణాటకలో ఇప్పటికే సినిమా ధియేటర్స్ 50% ఆక్యుపెన్స్ తో కొనసాగుతున్నాయి. మరోవైపు ఢిల్లీ మహారాష్ట్రలో చాలావరకు థియేటర్స్ మూతపడ్డాయి. చూస్తుంటే మరో రెండు మూడు నెలల వరకు పరిస్థితి ఇదే తరహాలో ఉంటుందని చెబుతున్నారు

రాధాకృష్ణ ట్వీట్ వైరల్

రాధాకృష్ణ ట్వీట్ వైరల్

ఇక ప్రస్తుతం పరిస్థితులపై దర్శకుడు రాధాకృష్ణ సోషల్ మీడియా ద్వారా ఒక వివరణ ఇచ్చాడు... సమయాలు కఠినమైనవి అంటూ.. హృదయాలు బలహీనంగా ఉన్నాయి, మనస్సులు అల్లకల్లోలంగా ఉన్నాయి. జీవితం మనపైకి ఏది విసిరినా - మన ఆశలు ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉంటాయి. సురక్షితంగా ఉండండి, ఉన్నతంగా ఉండండి.. అంటూ రాధా కృష్ణ కుమార్ రాధేశ్యామ్ టీమ్ తరుపున తెలియజేస్తూన్నట్లు ట్వీట్ చేశాడు.

వాయిదాపై క్లారిటీ

వాయిదాపై క్లారిటీ

దర్శకుడు రాధాకృష్ణ అలా వివరణ ఇవ్వడంతో తప్పకుండా సినిమా వాయిదా పడుతుంది అని అనుమానాలు చాలానే వచ్చాయి. డైరెక్టుగా సినిమా వాయిదా పడుతుంది అని అంటున్నావ్ కదా అని మరొక నెటిజన్ ప్రశ్నించగా.. అలాంటిదేమైనా ఉంటే డైరెక్ట్ గా అఫీషియల్ గా చెప్తాం.. అని కూడా రాధాకృష్ణ మరొక వివరణ ఇచ్చాడు. అంటే ప్రస్తుతం అయితే విడుదల విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని తెలుస్తోంది.

Recommended Video

Pan-India Movies Stepping Back, Here Is The Release Details | RRR | Radhe Shyam | Filmibeat Telugu
భారీగా ఓటీటీ ఆఫర్స్

భారీగా ఓటీటీ ఆఫర్స్


రాధేశ్యామ్ సినిమాకు ప్రస్తుతం ఓటీటీ ఆఫర్స్ కూడా చాలానే వస్తున్నాయి. కొన్ని బడా సంస్థలు డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్ కోసం దాదాపు 300 కోట్ల వరకు ఆఫర్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ చిత్ర యూనిట్ సభ్యులు 350 కోట్ల వరకు డీల్ సెట్ చేసుకునే ఆలోచనలో కూడా ఉన్నట్లు కథనాలు వచ్చాయి. ఏక్ ప్రస్తుత పరిస్థితులలో థియేట్రికల్ గా 200 కోట్ల షేర్ వసూలు అందుకోవడమే చాలా కష్టం. పెట్టిన పెట్టుబడికి 350 కోట్లు అంటే ఓటీటీ బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు. మరి రాధేశ్యామ్ ఏ విధంగా ముందుకు వెళుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X