చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ ఫిక్స్ .. అదిరిపోయే టైటిల్ ఇచ్చిన దర్శకేంద్రుడు..
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరే బ్రాండ్.. ఆయన పేరు చెప్తేనే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. అలాంటిది మెగాస్టార్ సినిమా అంటే మామూలుగా ఉండదు. గతంలో 'వాల్తేరు వీరయ్య' సినిమాతో హిట్టు కొట్టిన మెగాస్టార్.. ప్రస్తుతం బింబిసారా దర్శకుడు వశిష్టతో 'విశ్వంభర' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సమ్మర్ లో విడుదల కానున్నది. ఈ సినిమా తర్వాత చిరంజీవి చేతుల్లో మరో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే అందులో ఒకటి శ్రీకాంత్ ఓదెల మూవీ కాగా.. అనిల్ రావిపూడి తో మరో సినిమా చేస్తున్నానంటూ చిరంజీవి స్వయంగా ప్రకటించారు. అయితే ఆ సినిమాకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఓ టైటిల్ సూచించారు. ఇంతకీ ఆ టైటిల్ ఏంటీ?
మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా అనిల్ రావిపూడిలో చేయబోతున్నారు. ఈ విషయంపై తాజాగా చిరంజీవి 'లైలా' ప్రీ రిలీజ్ వేడుకలో మరింత క్లారిటీ ఇచ్చారు. సాహు గారపాటి నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన సినిమా తెరకెక్కబోతుందని చిరంజీవి స్వయంగా ప్రకటించారు. మొదటి నుంచి అనిల్ రావిపూడి ఒక మంచి కామెడీ కథతో రాబోతున్నట్లు హింట్ ఇస్తూ వస్తున్నారు. అనిల్ రావిపూడి కథ చెప్పిన ప్రతిసారి కడుపు పట్టుకుని నవ్వుతూనే ఉన్నాను అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. చాలా సంవత్సరాల తర్వాత ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ చేయబోతున్నట్లు చిరంజీవి వెల్లడించారు.

ఇదెలా ఉంటే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నం సినిమా ఎలాంటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో దుమ్మురేపింది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీని స్రుష్టించింది. ఇప్పటి వరకు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.250 కోట్ల వసూలు అందుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విజయోత్సవ వేడుకలను ముగించే ముందు మేకర్స్ ఒక చివరి ప్రమోషనల్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు, హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి, గెస్ట్ లుగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా డైరెక్టర్ రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. మీ సినిమా ఇండస్ట్రీకి 'సంక్రాంతి' తెచ్చింది. ఎక్కువ థియేటర్లలో ఎక్కువ షోలు సినిమా ఆడటం చాలా రోజుల తర్వాత చూస్తున్నాననీ, మూవీ యూనిట్ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే.. సంక్రాంత్రికి వస్తున్నాం హీరోయిన్లు ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షీ చౌదరి ల నటన చాలా అద్భుతంగా ఉండని, వెంకటేశ్ బయట సైలెంట్‌గా ఉన్నా.. ఇద్దరు హీరోయిన్స్ తో తెరపై సందడి చేశారని కామెంట్స్ చేశారు. అలాగే.. భీమ్స్ సంగీతం సినిమాకు మరో హైలెట్. మీ కాంబినేషన్‌లో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్ననని పేర్కొన్నారు.

ఈ క్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి మాట్లాడుతూ .. సంక్రాంతి సీజన్‌ను వదిలిపెట్టొద్దని, మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో రాబోయే సినిమా కోసం తాను తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. చిరంజీవి సినిమా 2026 సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్నదనే ఊహాగానాలు ఉన్నాయి. హస్య ప్రధానం కాబట్టి ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెట్టాలని కూడా ఆయన సూచించారు. ప్రస్తుతం రాఘవేంద్రరావు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











