Rajamouli: హీరోలకు షాక్ ఇచ్చేలా రాజమౌళి డ్యుయెల్ రోల్.. స్టైలిష్ లుక్ వీడియో వైరల్
తెలుగు చిత్రసీమలో ఓటమి ఎరగని దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది అందరూ చెప్పే ఒకే ఒక్క పేరు ఎస్ఎస్ రాజమౌళి. శాంతి నివాసం అనే టీవీ సీరియల్ తో ప్రారంభమైన జక్కన్న సినీ ప్రయాణం నేడు ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేసింది. జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతో సినిమా దర్శకుడిగా పరిచయమైన రాజమౌళి గతేడాది RRR మూవీతో వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా తెలుగు చిత్రసీమకు ఆస్కార్ అవార్డ్ తీసుకొచ్చిన ఘనత సాధించారు. అయితే తాజాగా జక్కన్న ఊహించని లుక్ లో దర్శనం ఇచ్చారు.
సినిమా ఖ్యాతి:తెలుగు చిత్రీసీమలో దర్శక దిగ్గజంగా పేరొందారు రాజమౌళి (SS Rajamouli). ఆయన తెరకెక్కించిన మగధీర, ఈగ, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లూజన్ చిత్రాలు తెలుగు సినిమా ఖ్యాతిని అమాంతం పెంచాయి. ఇక గతేడాది విడుదలై సునామీ సృష్టించిన సినిమా 'రౌద్రం రణం రుధిరం' RRR.

భారీ అంచనాలు:ఈ RRR సినిమాకు ఆది నుంచే అవార్డుల పంట రాగా అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం ఆస్కార్ తో రాజమౌళి పేరు ప్రపంచం నలుమూలలకు విస్తరించింది. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో RRR మూవీ క్రేజ్ మరింతగా పెరిగింది. RRRకు ఆస్కార్ రావడంతో రాజమౌళి తర్వాత సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్:రాజమౌళిపై ఉన్న అంచనాలకు తగినట్లుగానే సూపర్ స్టార్ మహేశ్ SSMB29 ప్లాన్ చేశారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడనున్నట్లు ఓ వార్త అయితే వైరల్ అవుతోంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళి కనిపించిన తీరు విశేషంగా మారింది. వైట్ సూట్ లో స్టైలిష్ లుక్ తో హీరోలకు సైతం గట్టి పోటీ ఇచ్చేలా తళుక్కుమన్నారు.

ఒక డైరెక్టర్:రాజమౌళి తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ తయారీ సంస్థ ఒప్పో యాడ్ మేకింగ్ లో ఎంతో స్టైలిష్ గా మెరిసారు. ఈ యాడ్ కు సంబంధించిన టీజర్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇప్పటివరకు సెలబ్రిటీ హీరో, హీరోయిన్లు, స్టార్ ఆటగాళ్లు వంటి వాళ్లే బ్రాండ్లకు అంబాసిడర్స్ గా ఉన్నారు. కానీ ఒక డైరెక్టర్ బ్రాండ్ అంబాసిడర్ గా కనిపించడం చాలా అరుదు. ఆ లోటు తీరుస్తూ హీరోలు షాక్ అయ్యే విధంగా రాజమౌళి లేటెస్ట్ యాడ్ లుక్ ఉంది.
జూలై 10న :ఒప్పో అప్ కమింగ్ ఫోన్ రెనో 10 సిరీస్ తో వస్తున్న ఫోన్ యాడ్ లో రాజమౌలి వైట్ సూట్ వేసుకుని కెమెరా యాంగిల్స్ చెప్పడం చూడొచ్చు. ఇందులో పక్క పక్కనే రాజమౌళి డ్యూయల్ రోల్ లుక్ కనిపించి అట్రాక్ట్ చేసింది. జూలై 10న లాంచ్ కానున్న ఈ యాడ్ లో చాలా స్టైలిష్ గా, హ్యాండ్సమ్ గా, డ్యూయల్ రోల్ లో రాజమౌళి కనిపించడం ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. దీంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











