RRR సంగతేంటో తేలేది ఆ రోజే.. స్పీడ్ పెంచనున్న జక్కన్న.. స్పెషల్ అప్డేట్!

టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియాన్ సినిమాగా రూపొందుతున్న RRR సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పైగా ఇద్దరు అగ్ర హీరోలు నటిస్తుండడం దర్శకధీరుడు బాహుబలి తరువాత తెరకెక్కిస్తున్న ప్రాజెక్టు కావడంతో దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇంకా సస్పెన్స్ వీడలేదు. అయితే త్వరలో జక్కన్న ఆ సంగతేంటో చూడనున్నాడట.

న్యూ ఇయర్ సర్ ప్రైజ్..?

న్యూ ఇయర్ సర్ ప్రైజ్..?

రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమాకు సంబంధించిన రెండు పాత్రల ఫస్ట్ లుక్ టీజర్స్ అయితే వచ్చేశాయి. అయితే ఈ న్యూ ఇయర్ కు ఏదైనా సరే ప్రైజ్ ఉంటుందేమోనని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు.

RRR నుంచి కూడా కిక్కు కావాలని

RRR నుంచి కూడా కిక్కు కావాలని

అలాగే సంక్రాంతికి కూడా స్పెషల్ అప్డేట్ ఉండవచ్చని కూడా ఆశలు పెట్టుకున్నారు. కానీ అప్పుడు కూడా ఏదైనా క్లారిటీ ఇస్తారో లేదో తెలియదు. ఈ విషయంలో అభిమానుల్లో కొంత అసహనం అయితే పెరుగుతోంది. ఎందుకంటే చాలా వరకు స్టార్ హీరోలు న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని అప్డేట్స్ ఇచ్చారు. రాధేశ్యామ్, వకీల్ సాబ్ అభిమానులు మంచి కిక్కులో ఉన్నారు. ఇక RRR నుంచి కూడా అలాంటి సర్ ప్రైజ్ కిక్కు కావాలని అనుకుంటున్నారు.

ఆ దెబ్బలతో మరింత ఆలస్యం..

ఆ దెబ్బలతో మరింత ఆలస్యం..

అయితే ఈ సినిమా షూటింగ్ విషయంలో దర్శకుడికి అనుకోని విధంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సినిమా మొదలైనప్పటి నుంచి కూడా ఆటంకాలకు అడ్డు అదుపు ఉండడం లేదు. ఒక షెడ్యూల్ ను ఫినిష్ చేసే లోపే కొత్త తరహా సమస్యలు వచ్చి పడుతున్నాయి. హీరోల గాయాలు కొన్నిసార్లు బ్రేక్ ఇవ్వగా ఆ తరువాత కరోనా దెబ్బ మరింత లాంగ్ బ్రేక్ ఇచ్చింది.

సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

అంతా సెట్టయ్యింది అనుకుంటున్న సమయంలో రామ్ చరణ్ కోవిడ్ భారిన పడడంతో మళ్ళీ షెడ్యూల్ లో మార్పులు చేయాల్సి వస్తోంది. అయితే ఈ నెల 7 నుంచి మళ్ళీ షూటింగ్ ను స్టార్ట్ చేసి సినిమాకు సంబంధించిన కీలకమైన రిలీజ్ అప్డేట్ ను జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా తెలిపే అవకాశం ఉందట. ఇక సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. మరి వారి ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X