SSMB29: మహేష్‌తో రాజమౌళి మూవీ డేట్ ఫిక్స్.. ఏ రోజు ప్రారంభమంటే?
SSMB29: ఇండస్ట్రీలో మోస్ట్ అవెయిటెడ్ కాంబో ఏదైనా ఉంటంటే అది సెన్సెషనల్ డైరెక్టర్ రాజమౌళి- టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుది అని చెప్పవచ్చు. ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న క్రేజీ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు.. పాన్ ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ చాలా ఇగర్ ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా సస్పెన్స్ కి తెర పడబోతుంది. త్వరలో ఈ కాంబోలో రాబోతున్న మూవీ అనౌన్స్ మెంట్ రాబోతుంది. అటు ప్రిన్స్ మహేష్ బాబు క్రేజ్ కి, సెన్సెషనల్ డైరెక్టర్ రాజమౌళి ఇమేజ్ కు తగ్గట్టుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఓ భారీ బడ్జెట్ మూవీ రాబోతోంది.
అడ్వెంచరస్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. అది కూడా బంగారు గనుల వేటలో చేసే సహసాలు నేపథ్యంలో ఈ మూవీ సాగునున్నదంట. గోల్డ్ కి రిలేటెట్ గా ఉండే టైటిల్ పెట్టాలని భావిస్తున్నారంట. కానీ, అధికారికంగా ప్రకటించే వరకు వెయిట్ చేయాలి. ఇప్పటి వరకూ ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్స్ లేవని ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు.

వాస్తవానికి మహేష్ బాబు - రాజమౌళి కాంబోలో రాబోయే మూవీ (SSMB29)కి సంబంధించిన అప్డేట్ ఆగస్ట్ 9న మహేష్ పుట్టినరోజు స్పెషల్గా ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అటు ప్రిన్స్ ఫ్యాన్స్, అటు జక్కన్న ఫాన్స్ కూడా ఎదురుచూసారు. కానీ,ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో మురారీ రీ రిలీజ్ తోనే సరిపెట్టుకున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. తాజాగా మహేష్ బాబు - జక్కన్న కాంబోలో వస్తున్న మూవీ (SSMB29)నుంచి అదిరిపోయే న్యూస్ వైరల్ అవుతుంది.
డైరెక్టర్ జక్కన్న 51 వ బర్త్ డే సందర్భంగా అక్టోబర్ 10న ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ వస్తుందని టాక్. ఈ నేపథ్యంలో ఈ నెల చివరి వారంలో ఓ వర్క్ షాప్ ప్రారంభించనున్నారట. ఈ వర్క్ షాప్ లో మూవీలో నటించే ప్రధాన పాత్రధారులు పాల్గొంటారట. బాహుబలి మూవీ టైంలో కూడా ఇలాంటి షెడ్యూలే ఫాలో అయ్యారంట పని రాక్షసుడు జక్కన్న. అలాగే.. భారీ అంచనాలతో వస్తోన్న ఈ మూవీని నిర్మాత కె.ఎల్. నారాయణ రూ.1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్. హాలీవుడ్ రేంజ్ లో తీయబోయే మూవీకి ఈ మాత్రం బడ్జెట్ ఉండాలి మరీ.
ఇక మెయిన్ షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం కాబోతుందట. మరో ఇంట్రెస్టింగ్ మ్యాటరేంటంటే.. మూవీకి సంబంధించిన ఎక్కువ షూటింగ్ విదేశాల్లో, అది కూడా అడవుల్లో ఉండబోతుందట. భారీ యాక్షన్ సీన్స్ ను ఇక్కడే చిత్రీకరించబోతున్నారంట. ఈ యాక్షన్ పార్టే మూవీకి హైలెట్ కాబోతున్నాయని టాక్.హై-వోల్టేజ్ యాక్షన్ అండ్ అడ్వెంచరస్ గా రాబోతున్న ఈ మూవీలో మహేష్ బాబుకు సరసన ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ నటించనుందని తెలుస్తోంది. ఈ మూవీకి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తుండగా..కీరవాణి సంగీతం అందించబోతున్నారట. మొత్తానికి ఈ క్రేజీ అప్డేట్ ప్రకారం.. అక్టోబర్ లో వర్క్ షాప్, డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.మరీ జగన్నఈ సారి ఏం మయా చేస్తాడో వేచి చూడాలి .


Click it and Unblock the Notifications











