RGV: ఆ హీరో సమాధి దగ్గరకు వెళ్లి నివాళులర్పించిన వర్మ.. మీరు మారిపోయారు సార్.. షాకింగ్!

ఎక్కువగా కాంట్రవర్సీ లతో వార్తల్లో నిలిచే విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎలాంటి సినిమా చేసినా కూడా దాన్ని పబ్లిక్ లోకి చాలా భిన్నంగా తీసుకు వెళుతుంటారు. ఇక సెంటిమెంట్స్ అనే వాటికి చాలా దూరంగా ఉండే రామ్ గోపాల్ వర్మ ఇటీవల అందరిని ఆశ్చర్యపరిచారు. సోషల్ మీడియాలో అయితే మీరు మారిపోయారు సార్ అనే డైలాగ్స్ కూడా వెలువడుతున్నాయి. ఇక వర్మతో పాటు గ్లామరస్ హీరోయిన్స్ కూడా తోడుగా వెళ్లారు. ఇక ఆ వివరాల్లోకి వెళితే..

Recommended Video

RGV Pays Tribute To Kannada Star Puneeth Raj Kumar | Filmibeat Telugu
హీరోయిన్స్ తో అలా..

హీరోయిన్స్ తో అలా..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా కూడా సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ఇటీవల కాలంలో అయితే వర్మ హీరోయిన్స్ కు సంబంధించిన ట్వీట్స్ తో షాక్ ఇస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అందమైన హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా షేర్ చేసుకుంటున్నాడు. అంతేకాకుండా కొంతమంది ఫిమేల్ యాంకర్స్ ని కూడా ఎట్రాక్ట్ చేస్తూ ఉండడం విశేషం.

 ఆ క్యారెక్టర్ తోనే..

ఆ క్యారెక్టర్ తోనే..

అయితే అప్పుడప్పుడు వర్మ ఎవరూ ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుంటూ షాక్ ఇస్తూ ఉంటాడు. సాధారణంగా వర్మ ఎలాంటి భావోద్వేగాలకు లోనుకాకుండా ఉంటాడు అని అందరికీ తెలిసిన విషయమే. సెంటిమెంట్స్ అనే వాటికి కూడా చాలా దూరంగా ఉంటాను ఆయనే చాలా సార్లు చెప్పాడు. ఒక విధంగా ఆ క్యారెక్టర్ ను చూసే చాలా మంది ఆయనకు ఫ్యాన్స్ గా మారిపోయారు.

ఆ హీరో సమాధి దగ్గరకు వెళ్లి..

ఆ హీరో సమాధి దగ్గరకు వెళ్లి..

ఇక రీసెంట్ గా అయితే రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు లేని విధంగా ఒక హీరో సమాధి దగ్గరికి వెళ్లి ఆయనకు ప్రత్యేకంగా నివాళులర్పించి మరో షాక్ ఇచ్చాడు అనే చెప్పాలి. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైన ఫోటోలను కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం విశేషం. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 పునీత్ కు నివాళులు

పునీత్ కు నివాళులు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పునీత్ రాజ్ కుమార్ సమాధి దగ్గరకు వెళ్లి ప్రత్యేకంగా నివాళులర్పించాడు. ఆయనతోపాటు హీరోయిన్స్ నైనా గంగూలి అలాగే అప్సర రాణి కూడా ఉన్నారు. వారు కూడా పునీత్ రాజ్ కుమార్ సమాధిని సందర్శించి ప్రత్యేకంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది.

 నమ్మలేకపోతున్నాను..

నమ్మలేకపోతున్నాను..

ఇక పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్ తో ఇదివరకే రాంగోపాల్ వర్మ కిల్లింగ్ వీరప్పన్ అనే ఒక సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే కొన్నిసార్లు పునీత్ రాజ్ కుమార్ ను ప్రత్యేకంగా కలుసుకున్నట్లు చెప్పిన వర్మ అంత మంచి వ్యక్తి మరణించాడు అంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను అని సోషల్ మీడియాలో తెలియజేశాడు.

మీరు మారిపోయారు సార్..

మీరు మారిపోయారు సార్..

ఇక రాంగోపాల్ వర్మ ప్రత్యేకంగా పునీత్ రాజ్ కుమార్ సమాధి దగ్గరకు వెళ్లి మరి నివాళులర్పించడం తో సోషల్ మీడియాలో ఆయన ఫాలోవర్స్ 'మీరు మారిపోయారు సార్' అంటూ టెంపర్ డైలాగ్ ను గుర్తు చేసుకుంటున్నారు. వర్మ లో కూడా చాలా ఎమోషన్స్ దాగి ఉన్నాయి కానీ ఆయన దాన్ని కనిపించకుండా కవర్ చేస్తూ ఉంటారు అని చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X