RGV: కన్నేసిన ఏ పిల్లను వదిలేట్టు లేడు... ఆమెతో ఆర్జీవీ కొత్త సినిమా!
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇక ఆయన ఏం చేసిన అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందనే విషయం తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో ఏవో ఒక సెన్సేషనల్ ట్విట్స్ పెడుతూ ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటారు ఆర్జీవీ. ఇక తాజాగా ఓ అమ్మాయికి హీరోయిన్ ఛాన్స్ ఇచ్చేశాడు ఈ సంచలన దర్శకుడు. కొద్దిరోజులగా ఆమె వీడియోలు పోస్టూ చేస్తూ.. సంచలనం రేపిన ఆర్జీవీ.. ఇప్పుడు ఆమెతో సినిమా అనౌన్స్ చేసి.. ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రామ్ గోపాల్ వర్మ.. ఏది చేసినా సంచలనమే.. ఒక ట్వీట్ చేసి వివాదాలు, సంచలనాలు సృష్టించగలరు. ఇక ప్రస్తుతం వ్యూహం చిత్రంతో బిజీగా ఉన్న ఈయన.. మరో చిత్రాన్ని అనౌన్స్ చేశారు. అసలు విషయం ఏంటంటే... ఆర్జీవీ హీరోయిన్లకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆయన సినిమాల్లో నటించాలంటే.. బోల్డ్ సీన్స్ లో నటించాల్సిందే. సినిమాలు హిట్ కాకపోయినా సరే హీరోయిన్ల మాత్రం బాగా ఫేమస్ అయిపోతారు.

ఇక ఆర్జీవీ దృష్టిలో పడ్డ వారిలో కేరళకు చెందిన సోషల్ మీడియా స్టార్ ఉంది. కొద్ది రోజుల క్రితం చీరకట్టులో ఉన్న ఓ అమ్మాయి వీడియోను ఆర్జీవీ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తానెవరో తెలిస్తే చెప్పండి అంటూ నెటిజన్స్ కు పరీక్ష పెట్టాడు. ఇది చూసిన ఫ్యాన్స్, నెటిజన్స్ అందరూ ఆ అమ్మాయి ఎవరా అని ఆరా తీశారు. అలా కొన్ని రోజులకు ఆమె కేరళకు చెందిన అమ్మాయిగా తెలిసింది.

ఇక రామ్ గోపాల్ వర్మ ఆ అమ్మాయిది ఓ రీల్ ను తన సోషల్ మీడియా ఖాతా వేదికగా పంచుకున్నాడు. దీంతో ఆమెకు ఫాలోవర్స్ ఒక్కసారిగా పెరిగిపోయారు. ఆ యువతి పేరు శ్రీలక్ష‍్మి సతీశ్ అని తెలుస్తోంది. అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ ఆమెతో ఏకంగా సినిమా తీసేందుకు సిద్ధం అయ్యాడు. ఆమెతో శారీ అనే సినిమా తీయనున్నట్లు సోషల్ మీడియా వేదికాగ ఏకంగా పోస్టర్ రిలీజ్ చేసి సంచలనం సృష్టించాడు. ఇది చూసిన నెటిజన్స్ అంతా.. మొత్తానికి మన ఆర్జీవీ అనుకున్నంత పని చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఒక్క వీడియోతో వైరల్ అయిన యువతికి.. ఏకంగా హీరోయిన్ ఛాన్స్ ఇచ్చేశాడు.. ఆర్జీవీ కన్నుల్లో మరో భామ పడిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆర్జీవీ తెరకెక్కించనున్న శారీ సినిమా నుంచే శ్రీలక్ష్మి హీరోయిన్ గా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమాకు అఘోశ్ వైష్ణవం దర్శకత్వం వహించనుండగా... ఆర్జీవీ డెన్ పతాకంపై తెరకెక్కునుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు

మేకర్స్. కాగా.. ప్రస్తుతం రాం గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్స్ ఆకట్టుకుంటున్నాయి. వైఎస్ జగన్ బయోపిక్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.


Click it and Unblock the Notifications











