Vyooham, Shapadham Movies: కిక్కిచ్చే న్యూస్ చెప్పిన ఆర్జీవీ, ఎన్నికలకు ముందే జగన్ బయోపిక్ సినిమాలు రిలీజ్

Vyooham, Shapadham Movies: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయలపై క్రియేటివ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సినిమాలు తీయబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం, ఆ తర్వాత జరిగిన పరిణాల గురించి వ్యూహం సినిమాలో సవివరంగా వివిరించే ప్రయత్నం చేయబోతున్నారు ఆర్జీవీ. అయితే ఆయన తాజాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేయబోతున్నట్లు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఎన్నికలకు ముందే ఆయన ఈ సినిమాలు విడుదల చేస్తానని ప్రకటించడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

నవంబర్ 10న వ్యూహం, జనవరి 25న శపథం సినిమా విడుదల : తెలంగాణలో నవంబర్ 30వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తుండగా.. అందుకు 20 రోజుల ముందే ఆర్జీవీ వ్యూహం సినిమాను విడుదల చేయబోతున్నారు. అంటే నవంబర్ 10వ తేదీన వ్యూహం సినిమా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాదండోయ్.. ఈ సినిమాకు సీక్వెల్ కూడా తీయబోతున్నట్లు తెలిపారు. అయితే ఆ సినిమాకు శపథం అనే పేరు పెట్టినట్లు చెప్పారు. దీనికి వ్యూహం - 2 అనేది ట్యాగ్. అయితే ఈ సినిమాను జనవరి 25వ తేదీన రిలీజ్ చేస్తానని స్పష్టం చేశారు. ఈ సినిమాల వల్ల తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి ప్రభావమూ ఉండకపోయినప్పిటకీ.. ఏపీ రాజకీయాలపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Director Ram Gopal Varma Announced Vyooham And shapadham Movies Release Date

వ్యూహం సినిమాలో జగన్ పాదయాత్ర, కేసులపై వివరణ : అయితే ఈ రెండు సినిమాల్లో.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు అజ్మల్ అమిర్ కనిపించనున్నారు. అలాగే వైఎస్ భారతి పాత్రలో మానస నటించనున్నట్లు సమాచారం. శ్రీరామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. కుట్రలు, కుతంత్రాలు, ఆలోచనలకు మధ్య ఎదిగిన ఓ నాయకుడిని కథనే ఈ సినిమాల్లో చూపించనున్నారు. వ్యూహం సినిమాలో జగన్ పాదయాత్ర, శపథం సినిమాలో ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుందని సమాచారం.

Director Ram Gopal Varma Announced Vyooham And shapadham Movies Release Date

ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ కుటుంబంలో జరిగిన పరిస్థితిపై పడ్డ క్రిమినల్ కేసులను హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే కఠిన పరిస్థితులను ఎదుర్కుంటూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా విజయాన్ని సాధించారనే దాన్ని శపథం సినిమాలో ఆవిష్కరించబోతున్నారట డైరెక్టర్ ఆర్జీవీ. వ్యూహం, శపథం సినిమాలకు సంబంధించిన రెండు పోస్టర్ లను కూడా క్రియేటివ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఈరోజు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్లు నెట్టింట వైరల్ గా మారాయి.

Director Ram Gopal Varma Announced Vyooham And shapadham Movies Release Date

మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతున్న వ్యాహం సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రాజకీయ నేతలు.. వైఎస్ అభిమానులు ఈ చిత్రాల గురించి తెగ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఎన్నికలకు ముందే ఈ చిత్రాలు రావడం వల్ల ప్రతిపక్షాలపై ప్రభావం పడుతుందని.. మళ్లీ వైఎస్ జగనే ముఖ్యమంత్రిగా గెలుస్తాడని చాలా మంది అనుకుంటున్నారు. మరి ఆర్జీవీ తెరకెక్కించబోయే ఈ చిత్రాలు నిజంగానే జనాల్లో మార్పు తీసుకువస్తాయని, రాజకీయాలను ఏమైనా ప్రభావితం చేస్తాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X