అనుకున్నదే జరిగింది.. కరోనా వైరస్ కోసం అర్జీవి స్పెషల్ మూవీ.. ఏం చూపిస్తాడో?
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా సెన్సేషన్ అవ్వడం కామన్. సినిమాలకంటే కాంట్రవర్సీలతోనే కాలం గడిపే వర్మ సోషల్ మీడియాలో అడుగుపెట్టిన తరువాత తన ఆలోచనల్ని ఎప్పటికప్పుడు బయటపెట్టడం స్టార్ట్ చేశాడు. ఎవరు ఊహించని విధంగా ప్రశ్నలు సందిస్తూనే.. అందరూ మెచ్చిన దానిపై కౌంటర్లు వేయడం ఆయనకు అలవాటే..

స్పీడ్ పెంచిన ఆర్జీవీ
సోషల్ మీడియాలో అర్జీవి గతంలో కంటే ఈ మధ్య చాలా స్పీడ్ గా స్పందిస్తున్నారు. నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా ఎప్పటికప్పుడు జరుగుతున్న విషయాలపై స్పందిస్తూ ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ పై కూడా ఆయన రోజు ఎదో ఒక కామెంట్ చేస్తున్నారు. మొన్న ఒక సాంగ్ ని రిలీజ్ చేసిన వర్మ ఇప్పుడు మరో కొత్త అప్డేట్ ఇచ్చాడు.

కరోనాపై సరికొత్త సినిమా..
విపత్తులైనా, వివాదలైనా.. అర్జీవి రెగ్యులర్ గా స్పందిస్తాడాని అందరికి తెలిసిన విషయమే. కుదిరితే సినిమా కూడా చేస్తాడని ఒక ఆలోచన రాకుండా ఉండదు. ఇక మరోసారి అర్జీవి తీరుపై ఫైనల్ గా అనుకున్నదే జరిగింది. ఆయన కరోనా వైరస్ పై సినిమా చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ కరోనా పై స్క్రిప్ట్ కూడా రెడీ చేసినట్లు చెప్పారు.

ఏం చూపిస్తాడో..
అర్జీవి తన కాంట్రవర్సీలతో జనాల్ని ఆకర్షించినప్పటికి తన సినిమాలు మాత్రం కొంచెం కూడా సక్సెస్ అవ్వడం లేదు. ఎలాంటి సినిమాలు చేసినా బాక్సాఫీస్ ముందు దారుణమైన రిజల్ట్ ని అందుకుంటున్నాయి. ఇక కరోనా వైరస్ గురించి బాగానే సెర్చ్ చేసిన అర్జీవి ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ని తెరపై ఏ విధంగా ప్రజెంట్ చేస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.
Recommended Video

దిశ సినిమా వస్తుందా?
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన ఆధారంగా సినిమా చేయనున్నట్లు ఆ మధ్య క్లారిటీ ఇచ్చిన అర్జీవి ఆ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉండగానే బ్రేక్ ఇచ్చాడు. లాక్ డౌన్ తరువాత దాన్ని పూర్తి చేయాలని అనుకున్నారట. చాలా వరకు అర్జీవి ఎనౌన్స్ చేసిన సినిమాలన్నీ రిలీజ్ అవుతాయన్న గ్యారెంటీ లేదు. ఇక ఇప్పుడు కరోనా పై మూవీ ఎనౌన్స్ చేయడంతో నిజంగా సినిమా చేస్తారా? లేదా? అన్నది రిలీజ్ అయ్యే వరకు సందేహమే..


Click it and Unblock the Notifications











