రజినీకాంత్ మంచి యాక్టరంటే నమ్మను.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

రామ్ గోపాల్ వర్మ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. మూసలో కొట్టుకుపోతోన్న తెలుగు సినిమా గతిని పూర్తిగా మార్చేసిన ఫిల్మ్ మేకర్‌గా నిలిచారు. శివ సినిమాతో సంచలనం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ.. తెలుగు సినిమా గురించి చెప్పాలంటే శివకి ముందు, శివ తర్వాత అనేలా చరిత్రలో తన పేరు లిఖించుకున్నారు. ఈ సినిమాతో చిత్రీకరణ, సౌండ్ మిక్సింగ్, స్క్రిప్ట్, పాటలు అన్నింటిలోనూ మార్పులు చోటు చేసుకోవడం పాటు ఇప్పటికీ ఆ ప్రభావం కనిపిస్తూనే ఉంది.

కృషి, పట్టుదల ఉంటే ఎవరైనా అసాధారణ విజయాలు సాధించొచ్చని రామ్ గోపాల్ వర్మ నిర్మించారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా , ఎవరి దగ్గరా కనీసం అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయకుండా కేవలం తన సొంత కష్టాన్ని, ప్రతిభను నమ్ముకుని వర్మ ఇన్ని విజయాలు సాధించారు. తను దర్శకుడిగా మారడంతో పాటు ఎంతో మంది నటీనటులను, సాంకేతిక నిపుణులను భారతీయ చిత్ర పరిశ్రమకు అందించారు.

director ram gopal varma controversial comments on super star Rajinikanth

కృష్ణవంశీ, పూరీ జగన్నాథ్, శివ నాగేశ్వరరావు, గుణశేఖర్ ఉత్తేజ్, తేజ, హరీష్ శంకర్, అజయ్ భూపతి, అనురాగ్ కశ్యప్, మాధూర్ భండార్కర్ సహా దాదాపు 50 మందికి పైగా దర్శకులు వర్మ ఫ్యాక్టరీ నుంచి వచ్చినవారే. తన శిష్యులను దర్శకులుగా చేయడానికి ఆయన స్వయంగా నిర్మాతగా మారిన సందర్భాలు ఉన్నాయి. శివ, క్షణక్షణం, అంతం, గాయం, గోవింద గోవింద వంటి సినిమాలతో సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న రామ్ గోపాల్ వర్మ అనూహ్యంగా టాలీవుడ్‌ను వదిలి బాలీవుడ్‌కే అంకితమయ్యారు.

రంగీలా, సర్కార్, కంపెనీ , సత్య చిత్రాలతో బాలీవుడ్‌ను ఒక ఊపారు. రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలన్నీ భారతీయ చిత్ర పరిశ్రమలో కొత్తగా వచ్చే దర్శక నిర్మాతలకు, టెక్నీషీయన్లకు ఒక పాఠం వంటివని విశ్లేషకులు చెబుతుంటారు. కొన్నేళ్లు సైలెంట్‌గా ఉండిపోయిన వర్మ.. తిరిగి రక్తచరిత్ర, వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్ తదితర చిత్రాలతో టాలీవుడ్‌ను మళ్లీ షేక్ చేశారు. ఎవరూ టచ్ చేయని, కనీసం ఆలోచించడానికే భయపడే సబ్జెక్ట్స్‌ను టేకప్ చేయడం రామ్ గోపాల్ వర్మకు ఓ సరదా .

director ram gopal varma controversial comments on super star Rajinikanth

సినిమాలు తీసినా, తీయకున్నా వర్మకి యువతలో ఉన్న క్రేజ్ ఏ డైరెక్టర్‌కు లేదన్నది వాస్తవం. ముఖ్యంగా ఈ జనరేషన్ మొత్తం ఆయనకు వీరాభిమానులే. వర్మ మాటలు, చేతలు అన్నీ కాంట్రవర్సీయే. ఆ వివాదాలతోనే కాలక్షేపం చేస్తూ బోల్డెంత పబ్లిసిటీ సంపాదిస్తుంటారు ఆర్జీవీ. విషయం ఏదైనా సరే ఆయన మాటలు కుండబద్ధలు కొట్టినట్లుగా ఉంటాయి. వర్మకు కోర్టులు, కేసులు కొత్త కాదు. ఏపీలో వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన సినిమాలు, ట్వీట్లు, మాటలు వివాదాస్పదమై కేసుల వరకు వెళ్లాయి.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. రజనీకాంత్ అసలు స్టారేనా అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్టార్ వేరు యాక్టర్ వేరని.. రజనీకాంత్ మంచి యాక్టరా అని అడిగితే నాకు తెలియదని అన్నారు. అసలు స్లో మోషన్ లేకపోతే రజనీ లేరు.. ఆయన సినిమాలో ఏం చేయకుండా కేవలం అలా నడిచొచ్చినా జనం చూస్తారని వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆర్జీవీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రజనీ అభిమానులు మండిపడుతున్నారు.

More from Filmibeat

Read more about: ram gopal varma rajinikanth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X