కూలి సినిమానే కాదు.. రజినీ మూవీపై ఆర్జీవీ సంచలన వాఖ్యలు
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన 20లో సంచలనాత్మక చిత్రాలెన్నో తీశారు. ఇక బాలీవుడ్ లో తెలుగు డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి దుమ్ములేపిన ఏకైక దర్శకుడు మన రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికీ ఆయన నుంచి ప్రయోగాత్మకత చిత్రాలెన్నో వస్తూన్న సంగతి తెలిసిందే. ఇక ఆయన పేరు కొన్నాళ్లుగా తన సినిమాల కంటే.. సోషల్ మీడియా పోస్టుల ద్వారానే ఎప్పుడూ వార్తల్లో ఉండి ఉంటుంది. ఎప్పుడూ సామాజిక అంశాల విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. తాజాగా రజనీకాంత్ కూలి చిత్రంపై ఇంట్రెస్టింగ్ గా స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే..
కూలి సినిమా జోరు ప్రమోషన్..
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ - సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న చిత్రం కూలి. ఈ చిత్రంపై ప్రస్తుతం భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్, భారీ తారాగణం నటించిన ఈ సినిమాను మరింత గ్రాండ్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం కోసం కేవలం ఫ్యాన్స్, ప్రేక్షకులే కాదు. సౌత్, నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రముఖులు కూడా ఎదురు చూస్తుండటం విశేషం. దీంతో సినిమా రిలీజ్ కు ముందు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

ఆర్జీవీ కామెంట్స్..
కూలి చిత్రం 24 గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే సినిమాపై సినీ పరిశ్రమలోని ప్రముఖులు అద్భుతంగా ఉంటుందని తమ అభిప్రాయాలను ముందే వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆసక్తికరంగా ఎక్స్ వేదికన స్పందించారు. 'అసలు కూలి సినిమానే కాదు.. అది ఒక ఉద్యమం' అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రామ్ గోపాల్ వర్మ లాంటి విమర్శనాత్మక దర్శకుడులు కూలి సినిమాపై ఈ రేంజ్ ఓపీనియన్ ఇవ్వడం సినిమాపై మరింతగా అంచనాలను పెంచాయి. ఇక ఇటీవల కూలి చిత్రం నుంచి వచ్చిన పూజా హెగ్దే మోనికా సాంగ్ పైనా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
అడ్వాన్స్ బుకింగ్స్ లో హవా..
రజనీకాంత్ సినిమా కూలికి ప్రస్తుతం బీభత్సమైన స్పందన లభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు కూలి చిత్రానికే మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పటికే నార్త్ అమెరికాలో 2 మిలియన్ల డాలర్ల వసూళ్లను అందుకుందని మేకర్స్ వెల్లడించారు. ఇక ఇండియాలో మొదటి వారానికి గానూ 12 లక్షలకు పైగా టికెట్లను అమ్ముడు పోయిందని ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ సందర్భంగా తొలిరోజు కూలి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు వసూల్లు చేస్తుందనేది ఆసక్తికంగా మారింది.
ఇక ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ లో నిర్మాత కళానిధి మారన్ నిర్మిస్తుండటం విశేషం. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు అన్నీ కలుపుకొని సినిమాకు రూ.370 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సత్య రాజ్, హీరోయిన్ గా శృతి హాసన్, స్పెషల్ అప్పియరెన్స్ లో అమీర్ ఖాన్ నటిస్తుండటం విశేషం. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











