ఓ తాతా నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా?.. సీనియర్ కాంగ్రెస్ నాయకుడిపై వర్మ షాకింగ్ కామెంట్స్
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతుంది అని.ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వివాదాలతో నిత్యం ఆర్జీవీ వార్తల్లో ఉంటారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో పిచ్చికుక్క దాడిలో ఓ బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. దాని మీద మేయర్ విజయలక్ష్మిని ఇప్పటికి ఆర్జీవీ ట్రోల్ చేస్తూనే ఉన్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం ఏపీలో నాగార్జున యూనివర్సిటీకి ఆర్జీవీ వెళ్ళిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కౌంటర్ ఇచ్చారు. ఇక ఆర్జీవి కూడా మరో కౌంటర్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

సంతోషాన్ని ఇచ్చేవి శృంగారం, ఆహారం
నాగార్జున యూనివర్సిటీకిలో రామ్ గోపాల్ వర్మ విద్యార్థులకు సంబంధించిన మీటింగ్ లో వివాదస్పదమైన కామెంట్స్ చేశాడు. ఈ ప్రపంచంలో అత్యంత సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చేవి శృంగారం, ఆహారం మాత్రమే అన్నారు. అదే సందర్భంగా ఈ భూమి మీద మగవాళ్ళు అందరూ చనిపోయి తాను మాత్రమే ఉంటే అప్పుడు కావాల్సిన విధంగా సుఖపడోచ్చు. అప్పుడు నేను ఒక్కడినే మగాడిని ఉంటా కాబట్టి అంటూ కాస్తా శృతి మించి కామెంట్స్ చేశారు.

స్వర్గంలో సుఖపడటానికి
అలాగే స్వర్గంలో సుఖపడటానికి భూమి మీద సంతోషాలు వదిలేయాలని అందరూ చెబుతూ ఉంటారు. మీకు నచ్చినట్లు మీరు బ్రతకండి అంటూ సలహాలు ఇచ్చాడు.
అయితే ఈ కామెంట్స్ తరువాత వైరల్ గా మారాయి. ఈ నేపధ్యంలో తాజాగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీ హనుమంతరావు ఒక మీటింగ్ లో రియాక్ట్ అయ్యారు.

హనుమంతరావు వార్నింగ్
ఆర్జీవీ ఇష్టానుసారంగా మహిళలని అగౌరపరుస్తూ విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు. అతనికి మతిచెడిపోయింది. ఇలాంటి వారి మీద వెంటనే టాడా యాక్ట్ క్రింద కేసులు బుక్ చేసి జైల్లో పెట్టాలి. దీనికోసం ఏపీ ముఖ్యమంత్రి జగన్, గవర్నర్ ని కూడా కలుస్తా. తీసుకెళ్ళి చంచల్ గూడా జైల్లో వేయాలి. అతని మీద యాక్షన్ తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హనుమంతరావు వార్నింగ్ ఇచ్చాడు.
ఓ తాతా నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా
ఇక తరువాత కూడా వీహెచ్ ఒక వీడియో విడుదల చేసి ఆర్జీవీ మీద సీరియస్ అయ్యారు. చట్టపరంగా అతని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీహెచ్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆర్జీవీ ట్విట్టర్ లో రియాక్ట్ అయ్యారు. ఓ తాతా నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా... నాసా యాక్ట్ నాకు వర్తించదు. టాడా యాక్ట్ ఎప్పుడో 1995లోనే రద్దు చేశారు.. అని ట్వీట్ చేశారు.
డాక్టర్ కి చూపించుకోండి
ఈ విషయం కూడా తెలియని మీలాంటి లీడర్స్ వలనే కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉంది. ఒకసారి డాక్టర్ కి చూపించుకోండి అంటూ వర్మ ట్విట్టర్ లో రియాక్ట్ అయ్యారు. అలాగే మరో వీడియోకి కూడా నవ్వుతున్నట్లు ఎమోజీలు పెట్టిన వర్మ ఆ వీడియోకి కామెంట్స్ క్లిప్ యాడ్ చేశారు. నా చావు నేను చస్తా... మీ చావు మీరు చావండి అంటూ చెప్పారు. ఇప్పుడు వీహెచ్, ఆర్జీవీ మధ్య సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వార్ కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications











