Ram Gopal Varma : శృంగారం తర్వాత అమ్మాయిల ఫీలింగ్ ఇదే .. ఆర్జీవీ బోల్డ్ కామెంట్
వివాదాలు, రామ్ గోపాల్ వర్మ రెండూ ఒకచోటే ఉంటారు. ఆయన మాటలు, చేతలు అన్నీ కాంట్రవర్సీయే. ఆ కాంట్రవర్సీలతోనే ఎప్పుడూ లైమ్ లైట్‌లో ఉంటూ బోల్డెంత పబ్లిసిటీ సంపాదిస్తుంటారు వర్మ. కాంట్రవర్సీ సబ్జెక్ట్‌లు, సంచలనం కలిగించిన అంశాలపైనే ఆయన సినిమాలు తీస్తుంటారు. ఈ విషయంలో ఏ స్థాయిలో ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చినా వర్మ వినే రకం కాదు. ఒక్కోసారి ఆయన చేష్టలు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా మహిళలు, శృంగారం, వారి మనస్తత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్జీవీ. ఆ వివరాల్లోకి వెళితే :
టాపిక్ ఎలాంటి అయినా సరే మాటలు కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడటం వర్మ స్లైట్. కొందరు ఆర్జీవీని పిచ్చోడంటే, ఆయన అభిమానులు మాత్రం భారతదేశంలో స్వేచ్ఛను సంపూర్ణంగా అనుభవించే ఏకైక వ్యక్తి అంటూ పొగుడుతూ ఉంటారు. ఎంత మంది ఎన్ని రకాలుగా శాపనార్ధాలు , చీవాట్లు పెట్టినా.. వర్మ పాపులారిటీ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. మరీ ముఖ్యంగా సోసైటీలో అంతా మాట్లాడటానికి భయపడే .. సెక్స్, బోల్డ్, వల్గారిటీ వంటి విషయాల్లో ఆయన చాలా ఓపెన్‌గా ఉంటారు.

కొద్దిరోజుల క్రితం రామ్ గోపాల్ వర్మ ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సెక్స్, వర్జినిటీ వంటి అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను 17, 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన వర్జినిటీని కోల్పోయానని వ్యాఖ్యానించారు. బెడ్‌పై ఒక అబ్బాయి శృంగారంలో పాల్గొనే సామర్ధ్యాన్ని అంచనా వేయడం కష్టమని వర్మ తెలిపారు. ఇక చాలు ఆపు అని ఏ అమ్మాయి ఇంతవరకు తనతో చెప్పలేదని ఆర్జీవీ బోల్డ్ కామెంట్ చేశారు.
డేట్‌కు వెళ్లడం తనకు నచ్చదని, ఏదైనా ఇంట్లోనే అంటూ చెప్పాడు. అమ్మాయిలేనా ఆంటీలను కూడా ఇష్టపడతారా అని యాంకర్ అడగ్గా.. ఇద్దరూనంటూ వర్మ చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఎవరిలో ఉండే అట్రాక్షన్ వారిలో ఉంటుందన్నారు. అయితే అనుభవం ఉన్న వాళ్లు ఏ రంగంలోనైనా డామినేట్ చేస్తారని , అదే సూత్రం బెడ్‌రూమ్‌లోనూ వర్తిస్తుందని ఆర్జీవీ పేర్కొన్నారు.
తాజాగా మరో ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో చూడటమో లేక ఎవరో ఒకరు చెప్పడం వల్ల మహిళల గురించి కొన్ని అపోహలు, అభిప్రాయాలు ఏర్పడతాయన్నారు. పురుషుడు శృంగారానికి ముందు మహిళతో మాట్లాడితే.. అమ్మాయిలు మాత్రం కార్యం ముగిసిన తర్వాత మాట్లాడతారని వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిని కన్విన్స్ చేయడానికే మగాడు ప్రయత్నిస్తాడని కుండబద్ధలు కొట్టారు.
కానీ మహిళలు శృంగారం తర్వాత అతనితో ఎమోషనల్‌గా కనెక్టయి అప్పుడే మాట్లాడుతుందని వర్మ చెప్పారు. కానీ పురుషుడు మాత్రం ఎప్పుడైతే తన శారీరక వాంఛ తీరిందో ఇక ఆమెతో సంబంధం లేదన్నట్లుగా పక్కకి తిరిగి పడుకుంటాడని ఆర్జీవీ వ్యాఖ్యానించారు. అప్పుడు ఆమె దృష్టిలో పురుషుడు చులకనగా మారిపోతాడని, తనను వాడుకోవడానికే ఇప్పటి వరకు ఇలాంటి మాటలు మాట్లాడా అని భావిస్తుందని వర్మ చెప్పాడు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











