టిక్ టాక్ వీడియో చూసి.. అమ్మాయికి అర్జీవి ఆఫర్
టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా డిఫరెంట్ గానే ఉంటుంది. నెగిటివ్ పాజిటివ్ అనే మాటలకు తావివ్వకుండా ఎవరు ఊహించని విధంగా మాట్లాడటం ఆయనకె సొంతం. ఫైనల్ గా ఎదో ఒక కామెంట్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచే అర్జీవి ఒక టిక్ టాక్ యూజర్ కి అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడు.
అర్జీవి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను ఆ అమ్మాయి అందులో ఇమిటేట్ చేసింది. కూలి పని చేసేవాళ్ళు మాత్రమే కష్టపడతారు అంటూ.. సక్సెస్ ఫుల్ అయినోళ్లు ఎవరు కూడా కష్టపడరు అని అర్జీవి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అదే డైలాగ్ ఆ అమ్మాయి చెప్పడంతో ఆకర్షితులు అయిన అర్జీవి వెంటనే ఆమె వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మెయిల్ కి వివరాలు పంపండి అంటూ ఐడి కూడా పోస్ట్ చేశాడు.

ప్రస్తుతం అర్జీవి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ మధ్య కాలంలో అర్జీవి కారోనాకు సంబంధించిన మీమ్స్ తో సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నాడు. తనకు నచ్చిన కొటేషన్స్ కూడా ఇస్తూ హాట్ టాపిక్ అయ్యేలా చేస్తున్నాడు. ఇకపోతే అర్జీవి లక్ష్మీస్ ఎన్టీఆర్ తరువాత అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అంటూ మరో సినిమా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలు ఊహించని విధంగా దెబ్బకొట్టడంతో నెక్స్ట్ దిశా ఘటనను ఆధారంగా చేసుకొని ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











