RGV మరోసారి షాక్.. అమ్మాయితో కలిసి రొమాంటిక్ డ్యాన్స్.. వీడియో వైరల్

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా కూడా సోషల్ మీడియాలో ఈజీగా వైరల్ అవుతుంది. కాంట్రవర్సీ చేయడంలో తెలివిగా అడుగులు వేసే ఈ దర్శకుడు అంతకంతకు చాలా ఓపెన్ అవుతున్నాడు అనే చెప్పాలి. అయితే అమ్మాయిలను ఆకట్టుకునేలా కూడా వర్మ మాట్లాడే మాటలు లో ఎంత తెలివిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాంకర్స్ ను కూడా పొగుడుతూ వారికి ఒక్క రోజుల్లోనే ఫేమ్ వచ్చేలా చేస్తుంటారు. ఇక ఇటీవల ఒక బుల్లితెర నటితో చేసిన రొమాంటిక్ డాన్స్ వీడియో అందరినీ షాక్ కు గురి చేసింది. ఇక వీడియోను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ అందులో ఉన్నది తాను కాదని సరదాగా కామెంట్స్ కూడా చేస్తున్నాడు. ఇక కొన్ని నిమిషాల్లోనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వరుస ఇంటర్వ్యూలు

వరుస ఇంటర్వ్యూలు

ఒకప్పుడు సినిమాలతో ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ అనంతరం ఇంటర్వ్యూలు తో ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో అట్రాక్ట్ చేశాడు. తెలివైన మాటలతో ఎన్నో ప్రశ్నలు వదులుతూ ఆలోచింపజేస్తున్నాడు. లాజికల్ గా మాట్లాడుతూ యువతకు అతను మరింత దగ్గర అవుతున్నాడు. ఏ విషయం పైన అయినా సరే తనదైన శైలిలో స్పందిస్తూ తన టాలెంట్ ఏంటో చూపిస్తున్నాడు. అందమైన అమ్మాయి ల పై కూడా వర్మ చేసే కామెంట్స్ విభిన్నంగా ఉంటున్నాయి.

సినిమాల టాక్ ఎలా ఉన్నా కూడా

సినిమాల టాక్ ఎలా ఉన్నా కూడా

వర్మ ప్రస్తుతం సినిమాల కంటే కూడా ఎక్కువగా ఇంటర్వ్యూలో బిజీ అవుతున్నాడు అనే చెప్పాలి. లాక్ డౌన్ లో కూడా షార్ట్ ఫిలిమ్స్ తీసే OTT వరల్డ్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. ఆయన సినిమాల టాక్ ఎలా ఉన్నా కూడా పబ్లిసిటీ మాత్రం హై రేంజ్ లో ఉంటుంది. వీలైనంత వరకు కాంట్రవర్సి గానే కాన్సెప్ట్ జనంలోకి వెళ్లేలా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అయితే ఇంటర్వ్యూలలో కూడా వర్మ అమ్మాయిలను ఎట్రాక్ట్ చేసే విధంగా మాట్లాడుతున్నాడు

రొమాంటిక్ యాంగిల్

రొమాంటిక్ యాంగిల్

ఇక రీసెంట్ గా మరోసారి వర్మ తనలోని రొమాంటిక్ యాంగిల్ ను బయట పెట్టాడు. ఒక టీవీ నటి వర్మతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. ఇందులో సినీ నటి జ్యోతి కూడా పాల్గొంది. అయితే దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆ బర్త్ డే వేడుకలో సరదాగా డాన్స్ చేస్తూ కనిపించాడు. సినిమాలో హీరో హీరోయిన్ మధ్య ఎలాగైతే రొమాంటిక్ సీన్స్ కనిపిస్తాయో అదే తరహాలో వర్మ సీన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు.

Recommended Video

Ram Pothineni Birthday Wishes TO Devi Sri Prasad | #RAPO | HBD DSP

వీడియో వైరల్

ఆఖరికి అమ్మాయి కాళ్ళమీద కూడా ప్రయత్నం చేశాడు. చాలా ఫ్రీగా ఎంజాయ్ చేస్తూ స్టెప్పులు వేసిన వర్మను చూసి నెటిజన్లు ఒక విధంగా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. కొందరు పాజిటివ్ గా కామెంట్ చేస్తుంటే మరికొందరు నెగిటివ్ కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వర్మ ఫ్యాన్స్ మాత్రం బ్రతికితే ఆయనలానే బ్రతకాలని కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా దర్శకుడు వర్మ రోజురోజుకు తనంలోనే సరికొత్త యాంగిల్ ని బయట పెడుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. ఇక త్వరలోనే ఆర్జీవి మరిన్ని డిఫరెంట్ సినిమాలతో ఓటీటీ వరల్డ్ లో సందడి చేయబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X