ఓమిక్రాన్ ను దెబ్బ కొట్టాలాంటి RRRను వాడుకోండి.. RGV బాక్సాఫీస్ లాంటి ఐడియా!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సినిమాల్లో RRR టాప్ లిస్టులో ఉంది అనే చెప్పాలి. ఈ సినిమాను అసలు చూస్తామో లేదో అని చాలా మంది అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం కరోనా వైరస్ మళ్లీ తీవ్రంగా పెరుగుతోంది అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాకు ఒమిక్రాన్ కు లింకు పెడుతూ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎవరూ ఊహించని విధంగా ప్రభుత్వానికి ఒక ఐడియా ఇస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నాడు.

టికెట్ల రేట్ల కారణంగా
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఓమిక్రాన్ వేరియెంట్ వైరస్ మళ్లీ కొత్త తరహాలో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు కరోనా వైరస్ ను ఎదుర్కొన్న సినీ నిర్మాతలు చాలా ధైర్యంగా సినిమాలను విడుదల చేసుకుంటూ వస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్ల కారణంగా చాలా సందిగ్దత ఉన్నప్పటికీ సినిమాలను భారీ స్థాయిలో విడుదల చేసి కలెక్షన్స్ అందుకోవాలని చూస్తున్నారు.

RRR టెన్షన్..
ప్రస్తుతం అందరి చూపు అయితే ఎక్కువగా RRR సినిమా పైనే ఉంది. ఈ సినిమా 450 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కింది కాబట్టి తప్పకుండా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకోవాల్సి అవసరం అయితే ఉంది. లేకపోతే సినిమా తీవ్రస్థాయిలో నష్టపోతుంది. ఇప్పటికే చిత్ర నిర్మాతలు ఆ విషయంలో చాలా కంగారు పడుతున్నారు. కరోనా వైరస్ కారణంగా మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. మళ్ళీ థియేటర్స్ మూత పడితే చాలా ఇబ్బందిగా మారుతుంది.

ఆర్జీవి ఐడియా..
ఇటీవల విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓమిక్రాన్ వైరస్ పై ఎవరూ ఊహించని విధంగా ప్రభుత్వాలకు ఒక ఐడియా అంటూ ట్విట్టర్లో పేర్కొన్నాడు.. విడుదల సమయంలో కేవలం డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి RRR సినిమా చూసే అనుమతి ఇవ్వాలి.. అందుకోసం అయినాసరే అందరూ కూడా డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకుంటారు.. అని వివరణ ఇచ్చారు.

చాలా బాగుంది అంటూ
RRR సినిమాకు ఉన్న క్రేజ్ తో అయినా సరే చాలామంది వ్యాక్సిన్ తీసుకొని ఓమిక్రాన్ ను తగ్గించే అవకాశం అవకాశం ఉంటుంది అని తరహాలో దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ ఐడియా ఇచ్చాడు. దీంతో నెటిజన్లు కూడా ఈ ఐడియా చాలా బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా మరికొందరు అసలు సినిమా చూస్తామో లేదో అనే భయం కూడా మీమ్స్ చేస్తున్నారు.

అందుకే నార్త్ లో భారీగా ప్రమోషన్
RRR సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా ప్రాజెక్టుగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. కేవలం తెలుగులోనే కాకుండా దర్శకుడు రాంగోపాల్ వర్మ హీరో రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ గా ప్రమోషన్ చేస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీలో దర్శకుడు చాలా నమ్మకంతో ఉన్నాడు. కానీ నార్త్ లో ఇంకా జనాలు థియేటర్స్ వరకు రావడం లేదని అందుకే వారిని ఆకర్షించే విధంగా అన్ని దారులలో దర్శకుడు ప్రమోషన్ డోస్ పెంచుతున్నాడు.


Click it and Unblock the Notifications











