ఆలాంటి పెళ్ళాం వస్తే ఏ మగాడికైనా చావే.. ఆ హీరోపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్

Ram Gopal Varma: ఇటీవల టాలీవుడ్ ను షేక్ చేసిన అంశాల్లో యంగ్ హీరో రాజ్ తరుణ్-లావణ్య వివాదం ఒకటి. ఈ విషయం సోషల్ మీడియాలో తెగవైరలయిన విషయం తెలిసిందే. వీరిద్దరి కేసులో పలు సెన్సేషనల్ టాపిక్స్ బయటపడటంతో ఈ వివాదం రోజురోజుకు ముదురుతోంది తప్పా.. ఓ కొలిక్కి రావడం లేదు. రాజ్ తరుణ్ తనను 11 ఏళ్లుగా వాడుకున్నాడని మాల్వి మల్హోత్రా వల్ల దూరం పెడుతున్నాడని లావణ్య సంచలనం సృష్టించింది. అంతేకాకుండా తనకు అబార్షన్ కూడా చేయించాడని, మాల్వీ మల్హోత్రాను కూడా మధ్యలోకి లాగి ఆమెపై కూడా కేసు ఫైల్ చేసింది. దీంతో మాల్వీ కూడా లావణ్యపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో రాజ్ తరుణ్ కోర్టుకు వెళ్లగా కాస్త ఊరట లభించింది. హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై సన్సెషనల్ కామెంట్స్ చేశారు. మెయిన్ గా లావణ్యను టార్గెట్ చేస్తు కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. లావణ్యపై షాకింగ్ కామెంట్ చేశారు. ఆ ఇంటర్య్వూలో ముందుగా మాలీవుడ్ ఇండస్ట్రీలో అమ్మాయిపై కాస్టింగ్ కౌచ్ పై కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమా అవకాశం ఇస్తానని మోసం చేస్తే సదరు వ్యక్తిపై కేసు పెట్టాలి గానీ, ఇండస్ట్రీ మొత్తాన్ని తప్పుబడితే ఎలా ? అన్ని ప్రశ్నించారు. ఇండస్ట్రీలో మాఫీయా లాంటివి ఏం ఉండవు. అమ్మాయిలను టార్గెట్ చేయాలని ఎవరూ టార్గెట్స్ పెట్టుకోరు. అమ్మాయి కూడా ఇష్టం ఉంటే.. అలాంటి దారుణాలు జరుగుతాయి. వాళ్ల రిజెక్ట్ చేస్తే.. అక్కడితో మేటర్ క్లోజ్ కాదా'అని తన అభిప్రాయం వెల్లడించారు.

Director Ram Gopal Varma Sensational Comments On Raj Tharun And Lavanya Issue

మీడియా గురించి మాట్లాడుతూ.. 'ఇలాంటి విషయాలను మీడియానే హైలెట్ చేస్తుంది. ఈ సమయంలో అలాంటి పని చేసేవారు జాగ్రత్తగా ఉండాలని భావిస్తారు. నాలుగు రోజులైతే.. వారు కూడా మరిచిపోతున్నారు. ఇది స్మశన వైరాగ్యం లాగా ఉంటుంది. 2017లో టాలీవుడ్లో కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. కానీ, ఆ తరువాత అందరూ సైలెంట్ అయిపోయారు. ఆ విషయం ఏమైందో కూడా ఎవరికి తెలియదు. సినిమా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ కంటే మీడియా బ్లాక్ బాస్టర్ మూవీస్ తీయగలరు. కానీ, మీడియా వారు కేవలం ఫస్ట్ ఢప్ తీసి.. సెకండ్ ఢప్ వదిలేస్తారని సైటర్ వేశారు.

ఆ తరువాత జస్టిస్ హేమ కమిటీలో రిపోర్టుపై కామెంట్స్ చేశారు. పోలీసులు ఉన్న తరువాత ఈ కమిటీలు ఎందుకో తనకు అర్థం కావడం లేదన్నారు. 'మీటూ' అంటూ ఉద్యమాలు చేసే యాక్టర్స్ ఎవరూ తరువాత మళ్లీ ఇండస్ట్రీలోకి రారు. రాలేరు. మీడియాకు కూడా కావాల్సింది. గాసిప్స్.. కాంట్రవర్సీ మాత్రమే. నాలుగు రోజులైతే.. ఏ విషయమైన సైలెంట్ కావాల్సిందే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇక రాజ్ తరుణ్- లావణ్య విషయానికి వస్తే.. 'లావణ్య లాంటి పెళ్లాం ఉంటే.. ఎలాంటి మగాడైనా చచ్చిపోతాడు. ఆ అమ్మాయి అనే మాటాలు, చేసే ఆరోపణలు మామూలుగా లేవు. అది ఇది అంటూ మీడియాను కూడా ఆగం ఆగం చేస్తుంది. ఇంతవరకూ రాజ్ తరుణం కేసు పెట్టిందో కూడా అర్థం కావడం లేదు. ఈ విషయంలో కూడా మీడియా వింతగా వ్యవహరిస్తోంది. మీడియా మొదట చెప్పిన మాటను మీడియానే మరిచిపోతుంది. మార్చేస్తోంది.' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Director Ram Gopal Varma Sensational Comments On Raj Tharun And Lavanya Issue

ఈ సెన్సెషనల్ కేసులో ముందు లావణ్యను పొగిడారు. ఆమె కూడా అన్యాయం జరిగిందని ఓ రేంజ్ లో వార్తలు రాశారు పలు డిబేట్స్ పెట్టారు. ఆ తరువాత లేదు లేదు.. అంటూ మీడియానే మాట మార్చింది. ఇలా చేస్తే.. నిజమేంటని జనాలకు ఎలా తెలుస్తుంది? సామాన్యులు ఏం అర్థం చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల నిజమనేది 100 శాతం చనిపోతుందంటూ షాకింగ్ కామెంట్ప్ చేశారు.

ఇటీవల తనకు ఓ అనుభవం ఎదురైందంటూ.. తన ఫ్రెండ్ ప్రొడ్యూస్ చేస్తున్నా ఓ మూవీలో ఓ సంఘటన జరిగిందని, ఆ టీంలో వర్క్ చేస్తున్న ఓ లేడి అసిస్టెంట్ .. మేల్ అసిస్టెంట్ మధ్య ఏదో నడిసింది. కానీ.. లేడీ అసిస్టెంట్.. ఫలనా వ్యక్తి నాతో బ్యాడ్ గా బీహెవ్ చేస్తున్నారని కంప్లీట్ ఇచ్చింది. ఏం ఆలోచించకుండా.. అతడి నిర్ణయాన్ని పట్టించుకోకుండా వెంటనే ఆ అబ్బాయిని పనిలో నుంచి తొలగించాడు ఆ ప్రొడ్యూసర్. ఈ విషయంలో అబ్బాయికి అన్యాయం జరిగినా.. అది ఇన్స్టెంట్ జస్టిస్. అదే సరైనా న్యాయం. వాళ్లు సినిమా తీయాలనేది మెయిన్ టాస్క్.. కానీ వీళ్ల పంచాయతీలు తీర్చడం కాదు. వాడికి తరువాత ఏదో నష్టపరిహారం ఇచ్చేసి.. ఆ మ్యాటర్ ను అక్కడే సెటిల్ చేశారు. నిజంగా ఎవడు ఎవరికి 100 శాతం న్యాయం చేయలేరు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఆర్జీవీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X