Ram Gopal Varma: ఆయన వల్లే చాలా సంతోషంగా ఉన్నా.. లైవ్‌లోనే ముద్దు పెట్టిన ఆర్జీవీ!

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు షాకింగ్ కామెంట్లు చేస్తూ.. అంతకంటే షాకిచ్చే సినిమాలు తీస్తూ సెన్సేషన్ క్రియేట్ చేసే ఈయన తాజాగా ఏపీ రాజకీయాలపై వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే వ్యూహం సినిమా వస్తుండగా.. తాజాగా దానికి పార్ట్ 2 వ్యూహం శపథం సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

ఈక్రమంలోనే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్లు చేశారు. తాను, తనతో పాటు ప్రొడ్యూసర్ కిరణ్ కుమార్ ప్రస్తుతం.. చాలా సంతోషంగా ఉండడానికి కారణం ఓ వ్యక్తి అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత లైవ్ లోనే ఒ వ్యక్తికి ముద్దు పెట్టి షాకిచ్చాడు. ఆర్జీవీతో పాటు కిరణ్ కుమార్ సంతోషానికి కారణం అయిన వ్యక్తి ఎవరు, ఆర్జీవీ ముద్దు ఎవరికి పెట్టారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Director Ram Gopal Varma Shocking Comments About Nara Lokesh Check Details

రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ పొలిటికల్ మూవీ వ్యూహం. ఈ సినిమాకు కంటిన్యూగా చేసిన సినిమాయే శపథం. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్, భారతీ రెడ్డి పాత్రలో మానసలు నటించారు. ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఎన్నో అడ్డుంకులు ఏర్పడగా.. అన్నీ తొలగించుకుని ఫిబ్రవరి 23వ తేదీన విడుదలకు సిద్ధం అయింది వ్యూహం సినిమా.

అయితే ఈ సినిమా విడుదల అయిన వారం రోజులకే అంటే మార్చి ఒకటో తేదీన శపథం సినిమాను కూడా విడుదల చేయబోతున్నట్లు ఆర్జీవీ ఇప్పటికే ప్రకటించారు. ఈక్రమంలోనే తాజాగా ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూనే ఆర్జీవీ షాకింగ్ కామెంట్లు చేశారు. నారా లోకేష్ వల్లే తాను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నానని.. నవ్వుతో తన మొహం, ప్రొడ్యూసర్ కిరణ్ కుమార్ మొహం వెలిగిపోవడానికి కారణం ఆయనే అని చెప్పుకొచ్చారు.

మీడియా మిత్రులు ఎవ్వరికీ నేను థాంక్స్ చెప్పనని.. కేవలం నారా లోకేష్ కు మాత్రమే థాంక్స్ చెబుతానని అన్నారు. అలాగే ఆయన వల్లే ఈ సినిమాలు చేయగల్గానని చెప్పుకొచ్చారు. నా ముందు ఉన్న ఇన్ని కెమెరాల్లో.. ఒక్క దాని నుంచి అయినా నన్ను చూస్తారని అన్నారు. ఈక్రమంలోనే నారా లోకేష్ కు ఓ ముద్దు కూడా ఇచ్చారు. ఇది నీకే లోకేష్ అంటూ చెప్పుకొచ్చారు.

Director Ram Gopal Varma Shocking Comments About Nara Lokesh Check Details

నారా లోకేష్ తెలివి వల్లే ఎన్నికలు దగ్గరవుతున్న సమయంలో ఈ సినిమాలు విడుదల అయ్యేలా చేశారని అన్నారు. లేకపోతే ఈ సినిమా డిసెంబర్ లో వచ్చి ఈ పాటికి అందరూ అన్ని మర్చిపోయేవారని వివరించారు. అంత తెలివి గల నారా లోకేష్ అంటే తనకు చాలా ఇష్టం అని మరోసారి వివరించారు ఆర్జీవీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X