Don't Miss!
- News
మంకీపాక్స్ కలవరం: 10 రోజుల్లో 12 దేశాలకు వ్యాప్తి, వేగం పెరగనుందని డబ్ల్యూహెచ్ఓ అలర్ట్
- Sports
IND vs SA 2022: సన్‌రైజర్స్ ప్లేయర్స్‌కు పిలుపు?: రెండుగా టీమిండియా: కోచ్‌గా వీవీఎస్?
- Finance
176 NFOs మ్యూచువల్ ఫండ్స్ రూ.1.08 లక్షల కోట్ల సమీకరణ
- Technology
OnePlus స్నాప్‌డ్రాగన్ కొత్త చిప్ ఫీచర్లతో వన్‌ప్లస్ బ్రాండ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది
- Automobiles
పోర్ష్ టేకాన్ ఎలక్ట్రిక్ కారును టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించిన మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టి
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు మే 22 నుండి 28వ తేదీ వరకు..
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మంత్రి పేర్ని నానితో ముగిసిన ఆర్జీవి భేటి.. ఆ విషయం గురించి మాత్రమే చర్చించాం అంటూ..
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై ఏమాత్రం ఎవరు సంతృప్తిగా లేరు అని అందరికీ అర్థం అయినప్పటికీ కూడా ఎవరు బయటికి ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. ఇక టికెట్ల రేట్లను తగ్గించడం ఏ మాత్రం కరెక్ట్ కాదు అని సినిమా స్థాయికి తగ్గట్టుగా బడ్జెట్ బట్టి కూడా కేటాయించాలని కొందరు ధైర్యంగానే చెప్పారు. ఇక దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ట్వీట్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.. ముఖ్యంగా మినిస్టర్ పేర్ని నాని పై కౌంటర్లు ఇచ్చే విధంగా ట్వీట్స్ కూడా వేశారు. ఇక ఆయన ముఖాముఖి చర్చకు పిలవడంతో రాంగోపాల్ వర్మ అమరావతి సచివాలయంలో ప్రత్యేకంగా కలుసుకున్నారు. అనంతరం ఏం జరిగింది అనే విషయంలో కూడా వివరణ ఇచ్చారు.

భేటీకి వెళ్లే ముందు..
పేర్ని నానిని కలిసే కంటే ముందే దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎయిర్ట్ పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతూ నేను ఇండస్ట్రీ తరఫున ఏ మాత్రం వెళ్లడం లేదు అని చాలా క్లియర్ గా వివరణ ఇచ్చారు. కేవలం ఒక ఫిల్మ్ మేకర్ గా.. తను కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నాను కాబట్టి.. అదే విషయాన్ని మాత్రమే వాళ్ల ముందు ఉంచబోతున్నని తెలియజేశారు.

నేను మాట్లాడాల్సిన అవసరం లేదు..
ఇక
ఇండస్ట్రీలో
పెద్దల
గురించి
అలాగే
నాగార్జున
చేసిన
కామెంట్స్
గురించి
కూడా
నేను
స్పందించలేనని,
వాళ్లే
కాదు
ఎవరు
ఏం
మాట్లాడినా
కూడా
నేను
మాట్లాడాల్సిన
అవసరం
లేదు
అని
ఆర్జీవి
తెలియజేశాడు.
కేవలం
తాను
అనుకున్న
విషయాన్ని
మాత్రమే
ప్రస్తుతం
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం
ముందు
చెప్పబోతున్నట్లు
మీడియాకు
తెలియజేశాడు.

మీటింగ్ అనంతరం..
ఇక పేర్ని నాని తో రాంగోపాల్ వర్మ మీటింగ్ అనంతరం మీడియా ముందుకు వచ్చి మరొక విషయాన్ని తెలియజేశాడు. ఆర్జివి మాట్లాడుతూ.. తెలుగు సినిమా టికెట్ రేట్లు ఎందుకు తగ్గించాల్సి వచ్చింది అలా చేస్తే రికవరీ రేటు కూడా పడిపోతుంది. దాంతో సినిమాలకు సంబంధించిన క్వాలిటీ కూడా చాలా వరకు తగ్గుతుంది.. అదే విషయంపై నా 30ఏళ్ల అనుభవంతో మంత్రి గారితో మాట్లాడటం జరిగింది.

తుది నిర్ణయం ప్రభుత్వం చేతుల్లోనే..
కేవలం అక్కడ నా వ్యూ పాయింట్ మాత్రమే చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు సినిమా అయ్యే ఖర్చు వల్ల టికెట్ రేట్లు పెరుగుతున్నాయనే ఆలోచనలో ఉన్నారు. ఇరువైపులా ఉన్న సమస్యల గురించి అనేక కోణాలలో చర్చించడం జరిగింది. అంతే కాని నేను ప్రత్యేకంగా డిమాండ్ చేసింది ఏమీ లేదు. ఒక ఫిలిం మేకర్ గా మాత్రమే నేను అక్కడ నా అభిప్రాయాలను తెలియజేశాను. నా పర్సనల్ గా కొన్ని పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది. ఇక దాని పై ఆలోచించిన అనంతరం ఎలా పరిష్కరిస్తారు అనే తుది నిర్ణయం ప్రభుత్వం చేతుల్లోనే ఉంది.

అదే చర్చించడం జరిగింది
ఇక జిఎస్టీ గురించి కూడా మాట్లాడుతూ ఆ విషయంలో ఎవరు ఎంత ఎగ్గొడుతున్నారు అన్ని వివరాలు నా దగ్గర లేవు. నేను ఆ విషయం గురించి మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు క్వాలిటీ ఆఫ్ ద మూవీ మేకింగ్ ఆఫ్ మూవీపై.. థియేటర్లో టికెట్ల రేట్లను మరొకరు నిర్ణయించడం అనేది ఏమాత్రం ఆమోదయోగ్యమైన విషయం కాదు అని అదే చర్చించడం జరిగింది. ఇక సబ్సిడీ గురించి కూడా వారు కొన్ని అంశాలను నోట్ చేసుకున్నారు

సంతృప్తిగానే ఉన్నాను..
అయితే పవన్ కళ్యాణ్ గారికి బాలకృష్ణ దానికి కొంత పొలిటికల్ టచ్ ఉన్న ప్పటికీ ఇద్దరిని టార్గెట్ చేయడానికి మొత్తం చిత్ర పరిశ్రమను టార్గెట్ చేయడం అనే నిర్ణయాన్ని అయితే ఎవరు తీసుకోలేరు. నాని గారి చర్చల పై సంతృప్తిగానే ఉన్నాను. ఇక తనతోపాటు ఇండస్ట్రీకి సంబంధించిన వేరే వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకుంటారని.. ఎందుకంటే నేను ఒక్కడినే ఇండస్ట్రీ కాదు కదా.. అని రాంగోపాల్ వర్మ తెలియజేశాడు.