twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మానవత్వాన్ని చాటుకొన్న రోహిత్ శెట్టి.. పోలీసుల కోసం ఎనిమిది హోటళ్లు

    |

    బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి మరోసారి తన మానవత్వాన్ని చాటుకొన్నారు. ప్రాణాలకు తెగించి కరోనాపై పోరాటం చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది కోసం ముందుకొచ్చారు. విధుల నిర్వహణలో ఉన్న పోలీసులకు ముంబైలోని ఎనిమిది హోటల్స్‌లో ఉచితంగా భోజన వసతి, అలాగే విశ్రాంతి తీసుకోవడానికి వసతి కల్పించారు. దర్శకుడు రోహిత్ శెట్టి చాటుకొన్న మానవత్వాన్ని ముంబై పోలీసులు తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వెలుగులోకి తెచ్చారు. ఈ సందర్భంగా రోహిత్ శెట్టికి థ్యాంక్స్ చెప్పారు.

    కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్న పోలీసు సిబ్బంది కోసం దర్శకుడు రోహిత్ శెట్టి ముంబైలోని ఎనిమిది హోటల్స్‌లో మాకు వసతులు కల్పించారు. ఆ హోటల్స్‌లో సిబ్బంది విశ్రాంతితీసుకోవడానికి, స్నానాలు, బట్టలు మార్చుకోవడం, బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ లాంటి ఏర్పాట్లు చేశారు.

    Director Rohit Shetty supports to mumbai police amid Corona crisis

    ముంబైని సురక్షితం ఉంచేందుకు చేస్తున్న మా ప్రయత్నాలకు రోహిత్ శెట్టి అండగా నిలవడం చాలా గొప్ప విషయం. ఆయనకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నాం అని రోహిత్ శెట్టి పేర్కొన్నారు.

    ఇంతకు ముందు సినిమా రంగంలో రోజు వారీ వేతన కార్మికులను ఆదుకొనేందుకు రోహిత్ శెట్టి 51 వేల రూపాయలను విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.

    English summary
    Director Rohit Shetty supports to mumbai police amid Corona crisis. Mumbai police share on twitter that, #RohitShetty has facilitated eight hotels across the city for our on-duty #CovidWarriors to rest, shower & change with arrangements for breakfast & dinner. We thank him for this kind gesture and for helping us in #TakingOnCorona and keeping Mumbai safe.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X