టాలీవుడ్ దర్శకుడి క్రేజీ ప్రాజెక్ట్... స్పోర్ట్స్ డ్రామా బయోపిక్‌తో..

టాలీవుడ్‌కు చెందిన దర్శకుడు సాయి కిషోర్ మచ్చ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టబోతున్నారు. బాలీవుడ్‌లో పలు చిత్రాలను రూపొందించిన నిర్మాణ సంస్థలతో కలిసి ఓ ప్రముఖ క్రీడాకారుడి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించనున్నట్టు తెలిసింది. గతంలో తెలుగులో జేమ్స్ బాండ్ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

Director Sai Kishore Macha entry into Bollywood

ఆసియా క్రీడల నేపథ్యంగా సాగే కథను తెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని, ఓ రన్నర్, అథ్లెట్ జీవితాన్ని భావోద్వేగంగా చూపించేందుకు స్క్రిప్టు, పోస్ట్ ప్రొడక్షన్ వ్యహారాలపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. అథ్లెట్ బయోపిక్‌ను రెండు బాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థలు రూపొందించేందుకు ముందుకు వచ్చినట్టు సమాచారం. అథ్లెట్ పాత్రను పోషించే హీరో, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గాల వివరాలను అధికారికంగా త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.

భావోద్వేగమైన అంశాలతో కథ, ఉత్కంఠ భరితమైన కథనం, ఈ రెండింటికి తగినట్టుగా బ్యాక్ గ్రౌండ్ స్కోరును జోడించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. బాలీవుడ్‌, దక్షిణాదిలోని క్రేజీ టెక్నీషియన్స్, యాక్టర్స్ ఈ సినిమాలో పనిచేయబోతున్నట్టు సమాచారం.

గతంలో అల్లరి నరేష్, సాక్షి చౌదరీ జంటగా సాయి కిషోర్ మాచ దర్శకత్వంలో జేమ్స్ బాండ్ తెరకెక్కింది. ఈ చిత్రానికి రామబ్రహ్మం సుంకర (అనిల్ సుంకర) నిర్మాతగా వ్యవహరించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం ఆరోగ్యకరమైన వినోదంతో అందర్నీ ఆకర్షించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X