Baby తర్వాత వైష్ణవి కెరీర్ గురించి బాధపడ్డా.. డైరెక్టర్ కామెంట్స్.. ఏడ్చేసిన హీరోయిన్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ తనదైన శైలీలో మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా ఆనంద్ నటించిన చిత్రం బేబీ (Baby 2023) సినిమా విశేషంగా ప్రేక్షకాదరణ పొందుతోంది. దీంతో బేబి సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది చిత్రబృందం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సాయి రాజేష్ చాలా ఎమోషనల్ అవుతూ మాట్లాడారు. ఇందులో భాగంగానే హీరోయిన్ వైష్ణవి చైతన్య ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు.

సక్సెస్ మీట్:ఆనంద్ దేవరకొండ లేటెస్ట్ మూవీ బేబీలో ది సాఫ్ట్‌వేర్ డెవలపర్ వెబ్ సిరీసుతో తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ సాధించుకున్న సంపాదించుకున్న వైష్ణవి చైతన్య మరో కీలక పాత్ర పోషించింది. అలాగే విరాజ్ అశ్విన్ కూడా నటించాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా జూలై 14న విడుదలై మాసివ్ హిట్ కొట్టింది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.

గర్వంగా ఫీల్ కావాలి:"వైష్ణవి నా బాధ అంతా నీమీదే ఉండేది. ఈ సినిమా వల్ల నీ కెరీర్ ఎక్కడ పాడవుతుందో అని అదే ఆలోచన ఉండేది. ప్రతీక్షణం అదే ఆలోచించేవాన్ని. నెగెటివ్స్ వస్తుంటాయి. అవేం పట్టించుకోకు. లైట్ తీసుకో. ఒక ఇంపాక్ట్ ఉంటుంది. పడయప్ప (నరసింహా) సినిమా రిలీజైనప్పుడు రమ్యకృష్ణ కటౌట్ లు కాల్చేశారు. నీ క్యారెక్టర్ గురించి ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. అంతా బాగా చేశావ్ నువ్వు" అని సాయి రాజేష్ తెలిపారు.

Director Sai Rajesh About Vaishnavi Chaitanya Struggles In Baby Success Meet

ఏడూస్తూనే ఉంది:"తను అగ్రిమెంట్ మీద సంతకం పెడుతూ అలా ఏడుస్తూనే ఉంది. అంటే ఇన్ఫినిటమ్ లో మంచిగా ఒక గౌరవప్రదమైన శాలరీ తీసుకుంటూ జూబ్లీ హిల్స్ లో హ్యాపీగా ఉండేది. సినిమా స్టార్ట్ చేసిన మూడేళ్లు రెండేళ్లలో అత్తాపూర్ కు షిఫ్ట్ అయిపోయింది. అన్ని ఫైనాన్షియల్ ప్రాబ్రమ్స్ ఫేస్ చేసింది తను. నాకు తెలుసు, కానీ నేను హెల్ప్ చేసే పరిస్థితిలో లేను. అంతా కోల్పోయింది ఈ సినిమా కోసం" అని సాయి రాజేష్ చెప్పుకొచ్చారు.

Director Sai Rajesh About Vaishnavi Chaitanya Struggles In Baby Success Meet

చాలా హ్యాపీగా:"చాలా హ్యాపీగా ఉంది. చాలా గర్వంగా ఉంది. నన్ను పొగిడుతుంటే నాకు ఏమనిపించట్లేదు. కానీ, మీ ముగ్గురు బాగా చేశారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది" అని సాయి రాజేష్ పేర్కొన్నారు. అలా తనగురించి డైరెక్టర్ సాయి రాజేష్ చెబుతున్నప్పుడు వైష్ణవి ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంది.

Director Sai Rajesh About Vaishnavi Chaitanya Struggles In Baby Success Meet

కుమ్మేస్తావ్:సాయి రాజేష్ ఇంకా కొనసాగిస్తూ "విరాజ్.. నువ్ ఏమాత్రం ఇగో లేకుండా నటించావ్. ఆనంద్ లేపుతున్నారని, వైష్ణవిని పోస్టర్ లో చూపిస్తున్నారని, పోస్టర్ లో వైష్ణవి ఫొటోలు, ఆనంద్ ఫొటోలే ఉంటున్నాయి. నాకు ఎందుకు హైప్ ఇవ్వలేదు అని ఏ ఒక్కరోజు, ఒక్కసారి కూడా అడగలేదు. నువ్ ఇక నుంచి కుమ్మేస్తావ్" అని సాయి రాజేష్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X