Hit 2: హిట్ 2 లో విశ్వక్ సేన్?.. అందరూ తిట్టుకున్నారు, డైరెక్టర్ శైలేష్ కొలను కామెంట్స్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ గా నటించి అదరగొట్టిన చిత్రం హిట్ (HIT: The First Case). నాచురల్ స్టార్ నాని నిర్మాతగ వ్యవహరించిన ఈ చిత్రంతో శైలేష్ కొలను దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. నిజానికి శైలేష్ కొలను ఒక డాక్టర్. సినిమాలపై ఉన్న ఆసక్తితో డైరెక్టర్ అయ్యారు. చేసింది మొదటి సినిమా అయిన సూపర్ హిట్ కొట్టారు.

క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి సీక్వెల్ గా ఇప్పుడు హిట్ 2 (HIT: The Second Case) వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో విశ్వక్ సేన్ ఉన్నాడా? లేడా? అనే విషయంపై డైరెక్టర్ శైలేష్ కొలను ఆసక్తికరంగా సమాధానమిచ్చారు.

హిందీలో కూడా ఇదే పేరుతో..

హిందీలో కూడా ఇదే పేరుతో..

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా 2020లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ "హిట్: ది ఫస్ట్ కేస్". విశ్వక్ సేన్ పోలీస్ ఆఫీసర్ గా నటించి మెప్పించిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా హిందీలో కూడా ఇదే పేరుతో విడుదలైంది. అక్కడ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే తెలుగులో ఈ సినిమా వచ్చినప్పుడు దీనికి సీక్వెల్ ఉంటుందని హింట్ కూడా ఇచ్చారు. అందుకనుగుణంగానే ఇప్పుడు "హిట్: ది సెకండ్ కేస్" ను తీసుకువచ్చారు.

అయితే ఇందులో హీరోగా అడవి శేష్ నటించాడు. అలాగే ఇటీవల ఈ సీక్వెల్ మూవీ టీజర్ కూడా విడుదల చేశారు. దీంతో మొదటి సినిమాలో ఉన్న విశ్వక్ సేన్ సీక్వెల్ చిత్రంలో ఉంటారా అన్న ప్రశ్నకు ఆసక్తికరంగా సమాధానమిచ్చారు డైరెక్టర్ శైలేష్ కొలను.

ఫిక్షనల్ డిపార్ట్ మెంట్..

ఫిక్షనల్ డిపార్ట్ మెంట్..

ఇంతకుముందు హిట్ 2 టీజర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు డైరెక్టర్ శైలేష్ కొలను. ఈ వీడియోకు "హిట్ వెర్స్" అని పేరు పెట్టారు. అంటే హాలీవుడ్ లో వచ్చే యూనివర్స్ మూవీస్, లోకేష్ కనకరాజ్ యూనివర్సిటీలాగా హిట్ యూనివర్స్ లోకి ప్రేక్షకులను తీసుకువెళ్లనున్నారన్నమాట. హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ అనే ఫిక్షనల్ డిపార్ట్ మెంట్ ని ఇండియాలో ఒక్క స్టేట్ లోనే కాకుండా పలు రాష్ట్రాల్లో ఉన్నట్లు డైరెక్టర్ చూపించనున్నారట. ఈ యూనివర్స్ లోకి ముందుకు వెళ్లే కొద్ది రకరకాల ఆఫీసర్లు వస్తారట. అయితే హిట్ 2 ప్రకటించినప్పుడు ఫస్ట్ పార్ట్ లో ఉన్న విశ్వక్ సేన్ లేడేంటని అందరు తిట్టుకున్నారని డైరెక్టర్ తెలిపారు.

హల్క్ ని వదిలేయలేం కదా..

హల్క్ ని వదిలేయలేం కదా..

సీక్వెల్ మూవీలో విశ్వక్ సేన్ లేకపోవడంపై డైరెక్టర్ మాట్లాడుతూ.. "కెప్టెన్ అమెరికా వస్తున్నాడని హల్క్ ని వదిలేయలేం కదా. విక్రమ్ రుద్రరాజు (విశ్వక్ సేన్) ఎక్కడికి వెళ్లడు. ఈ యూనివర్స్ లోనే ఉంటాడు. మళ్లీ వస్తాడు. ఒక్కో పార్ట్ ను ఒక్కో హీరోతో తీద్దామనుకుంటున్నాం. అయితే ముందుగా రెండు పార్ట్ లు విశ్వక్ తోనే అనుకున్నాం. రెండు పార్ట్ లు ఎందుకు ఫస్ట్ ఒక్కో పార్ట్ లో ఒక్కో హీరోను చూపించి తర్వాత ఒక క్రైమ్ సాల్వేషన్ కోసం అందరూ ఆఫీసర్లను చూపిద్దాం అనుకున్నా. ఒక పెద్ద కేస్ సాల్వ్ చేసినప్పుడు విక్రమ్ రుద్రరాజు స్టోరీ కూడా పూర్తవుతుంది" అని శైలేష్ కొలను తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X